AMUL Recruitment 2022: ఏడాదికి రూ.5 లక్షల జీతంతో..అమూల్‌ మిల్క్‌ కంపెనీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

|

May 17, 2022 | 7:49 PM

ప్రపంచంలోనే అతిపెద్ద మిల్క్‌ కోపరేటివ్‌ కంపెనీ అయిన అమూల్‌(Amul).. అకౌంట్‌ అసిస్టెంట్ పోస్టుల (Account Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి..

AMUL Recruitment 2022: ఏడాదికి రూ.5 లక్షల జీతంతో..అమూల్‌ మిల్క్‌ కంపెనీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
Amul
Follow us on

AMUL Account Assistant Recruitment 2022: ప్రపంచంలోనే అతిపెద్ద మిల్క్‌ కోపరేటివ్‌ కంపెనీ అయిన అమూల్‌(Amul).. అకౌంట్‌ అసిస్టెంట్ పోస్టుల (Account Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: అకౌంట్‌ అసిస్టెంట్ పోస్టులు.

పని ప్రదేశాలు: లక్నో, జంషడ్‌పూర్‌

పే స్కేల్‌: ఏడాదికి రూ.4,00,000ల నుంచి రూ.5,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: బీకాం (కామర్స్‌ డిగ్రీ), ఎమ్‌కాం, ఎమ్‌బీఏ/పీజీడీఎంలో ఫస్ట్‌ క్లాస్‌ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అకౌంటింగ్‌, ట్యాక్సేషన్‌, ఫినాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో పని అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ నైపుణ్యాలు కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/మెడికల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.