Gen Z Career Tips: ఈ స్కిల్స్ మీ ఉద్యోగానికి శ్రీరామ రక్ష.. AI యుగంలో జెన్‌జీని లీడర్‌గా నిలబెట్టే టాప్ సీక్రెట్స్ ఇవే

ఏఐ మీ ఉద్యోగాన్ని మింగేస్తుందా? రాబోయే రోజుల్లో మీ కెరీర్ భద్రంగానే ఉంటుందా? టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ విప్లవం సృష్టిస్తున్న వేళ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి సామాన్య ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. అయితే నిపుణులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఏఐ ఏమీ చేయలేని రిస్క్ లేని ఉద్యోగాలు ఏంటి? భవిష్యత్తులో మనం రేసులో నిలబడాలంటే ఎలాంటి నైపుణ్యాలు పెంచుకోవాలో తెలుసుకుందాం..

Gen Z Career Tips: ఈ స్కిల్స్ మీ ఉద్యోగానికి శ్రీరామ రక్ష.. AI యుగంలో జెన్‌జీని లీడర్‌గా నిలబెట్టే టాప్ సీక్రెట్స్ ఇవే
Which Careers Are Ai Proof 2026
Image Credit source: AI Image

Updated on: Aug 07, 2026 | 1:17 PM

ఏఐ రోజురోజుకూ అద్భుతాలు సృష్టిస్తుండటంతో నా ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనే భయం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులను వెంటాడుతోంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పూర్తిగా ఏఐ ప్రూఫ్ ఉద్యోగాలు ఏవీ లేకపోయినా.. ఏఐ అంత ఈజీగా భర్తీ చేయలేని ఏఐ-రెసిస్టెంట్ రంగాలు చాలానే ఉన్నాయి. మానవ మేధస్సు, సంబంధాలు, సృజనాత్మకత, క్షేత్రస్థాయి నిర్ణయాలపై ఆధారపడే ఉద్యోగాలకు భవిష్యత్తులోనూ మంచి డిమాండ్ ఉంటుంది.

ఏ ఉద్యోగానికి ఎంత ముప్పు?

ఎక్కువ రిస్క్ : డేటా ఎంట్రీ, ట్రాన్స్‌క్రిప్షన్, ప్రాథమిక కస్టమర్ సపోర్ట్, బుక్‌కీపింగ్, రూల్స్ ఆధారంగా చేసే కోడింగ్, సాధారణ కంటెంట్ రైటింగ్, బేసిక్ గ్రాఫిక్ డిజైనింగ్

మీడియం రిస్క్ : సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, జర్నలిజం, మార్కెటింగ్, లీగల్ రంగాలు, ఫైనాన్స్, టీచింగ్, హెచ్‌ఆర్, అకౌంటింగ్.

తక్కువ రిస్క్ : డాక్టర్లు, నర్సులు, సైకాలజిస్టులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఆర్కిటెక్ట్లు, సైంటిఫిక్ రీసెర్చర్లు, వ్యాపారవేత్తలు, అత్యవసర సేవల సిబ్బంది

భవిష్యత్తులోనూ భద్రంగా ఉండే రంగాలు..

హెల్త్‌కేర్ – మెంటల్ హెల్త్: డాక్టర్లు, నర్సులు, ఫిజియోథెరపిస్టులు, మానసిక వైద్యులు. ఈ రంగాల్లో రోగులతో సానుభూతి, నమ్మకం, తక్షణమే క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. దీనిని ఏఐ భర్తీ చేయలేదు.

ఫిజికల్ – స్కిల్డ్ ట్రేడ్స్: ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, మెకానిక్‌లు. నిత్యం మారుతుండే భౌతిక వాతావరణంలో పనిచేసే ఈ చేతివృత్తులను రోబోలు లేదా ఏఐ ద్వారా భర్తీ చేయడం చాలా కష్టం.

పరిశోధన – శాస్త్ర సాంకేతిక రంగాలు: శాస్త్రవేత్తలు, బయోమెడికల్ మరియు క్లైమేట్ రీసెర్చర్లు. ఏఐ కేవలం డేటాను విశ్లేషించగలదు, కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు, విశ్లేషణలు మానవ మేధస్సుతోనే సాధ్యం.

లీడర్‌షిప్ – బిజినెస్ స్ట్రాటజీ: ఎంటర్‌ప్రెన్యూర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, బిజినెస్ స్ట్రాటజిస్టులు. స్పష్టత లేని సంక్లిష్ట పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం, బృందాలను నడిపించడం పూర్తిగా మానవ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది.

క్రియేటివ్ రంగాలు: ఫిలిం మేకర్లు, ఫోటోగ్రాఫర్లు, క్రియేటివ్ డైరెక్టర్లు, బ్రాండ్ స్ట్రాటజిస్టులు. ఏఐ కంటెంట్‌ను జనరేట్ చేయగలదు కానీ, సరికొత్త ఆలోచనలు, సమాజం మెచ్చే కథనం, సంస్కృతికి తగ్గ శైలిని అందించడం మనుషులకే సొంతం.

అతిపెద్ద అపోహ: ఏఐ నా ఉద్యోగాన్ని తీసేస్తుందా?

చాలామంది అనుకుంటున్నట్లు ఏఐ మీ ఉద్యోగాన్ని నేరుగా రాత్రికి రాత్రే తీసివేయదు. మెజారిటీ రంగాల్లో ఏఐ అనేది ఉద్యోగికి సహాయపడే ఒక సాధనంగా మాత్రమే మారుతుంది.

ఏఐ – హ్యూమన్ కాంబినేషనే భవిష్యత్

ఏఐతో పోటీపడటం కంటే ఏఐని మన నైపుణ్యాలకు తోడుగా ఉపయోగించుకోవడమే సరైన వ్యూహం. ఉదాహరణకు.. పరిశోధన కోసం ఏఐని వాడే జర్నలిస్ట్, రోగ నిర్ధారణ సపోర్ట్ కోసం ఏఐని వాడే డాక్టర్, డిజైనింగ్ త్వరగా పూర్తి చేయడానికి ఏఐని వాడే డిజైనర్.. ఏఐ వాడని వారి కంటే వేగంగా, సమర్థవంతంగా పనిచేసి రేసులో ముందుంటారు.

భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడే 8 కీలక నైపుణ్యాలు..

క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఏఐ లిటరసీ, అడాప్టబిలిటీ, నిరంతర అభ్యాసం

ఉద్యోగాలు ఒక్కరోజులో మాయమైపోవు, కానీ వాటి పనితీరు మారుతుంది. కాబట్టి ఏఐకి చిక్కని ఉద్యోగం కోసం వెతకడం కంటే.. ఏఐని సమర్థవంతంగా ఉపయోగిస్తూ, మనలోని మానవీయ నైపుణ్యాలను పదును పెట్టుకోవడమే అసలైన కెరీర్ సెక్యూరిటీ.

Loading...
Unable to load recommendations.
Follow Us