Flipkart Big Billion Days 2025: రెడీగా ఉండండి.. వచ్చేస్తోంది భారీ సేల్‌.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఎప్పుడు? ఈ సారి అంతకు మించి..

Flipkart Big Billion Days 2025: ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ అయిన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లలో భారీ సేల్‌ రాబోతోంది. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్‌తో మొబైల్స్‌, టీవీలు, వాషింగ్‌ మెషీన్స్‌, ఎలక్ట్రిక్‌ వస్తువులు ఇలా ఎన్నో రకాల వాటిని భారీ..

Flipkart Big Billion Days 2025: రెడీగా ఉండండి.. వచ్చేస్తోంది భారీ సేల్‌.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఎప్పుడు? ఈ సారి అంతకు మించి..

Updated on: Aug 25, 2025 | 3:49 PM

Flipkart Big Billion Days 2025: ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌లకు అలవాటు పడ్డారు. ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌ షాపింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అంతా పండగ సీజన్‌. ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ అయిన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లలో భారీ సేల్‌ రాబోతోంది. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్‌తో మొబైల్స్‌, టీవీలు, వాషింగ్‌ మెషీన్స్‌, ఎలక్ట్రిక్‌ వస్తువులు ఇలా ఎన్నో రకాల వాటిని భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇక ఇప్పుడు అందరి చూపు ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌ డేస్‌, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా సేల్‌పైనే ఉంది.

ఇది కూడా చదవండి: Dussehra-2025: దసరా పండగ ఎప్పుడు? అక్టోబర్‌ 1న లేదా 2వ తేదీనా..?

అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 30 నాటికి ముగుస్తుందని సమాచారం. ఈ తేదీలు ఫ్లిప్‌కార్ట్‌లోని అధికారిక ఉత్పత్తి పేజీలో కనిపిస్తాయి. ఈ పేజీ రూ.1 ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌ ప్రత్యేకంగా ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్‌ సభ్యులకు ఒక రోజు ముందుగానే సేల్‌ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

BSNL అద్భుతమైన ప్లాన్.. రూ.147కే 30 రోజుల వ్యాలిడిటీ.. అన్ని బెనిఫిట్స్‌!

ఇక అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ (Great Indian Festival) 2025 సెప్టెంబర్ చివరి నుండి అక్టోబర్ మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఇది భారతదేశ పండుగల సీజన్‌తో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సేల్‌లో అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ముందుగా యాక్సెస్ లభిస్తుంది. భారీ తగ్గింపులు, ఆఫర్లు ఉంటాయి. అయితే ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల ఈ భారీ సేల్‌లపై అధికారంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సారి ఐఫోన్‌లతో పాటు మరిన్నిస్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉంది. అలాగే స్మార్ట్‌ టీవీ, వాషింగ్‌ మెషిన్‌, ఫ్రిజ్‌లు కొనుగోలు చేసే వారికి బంపర్‌ డిస్కౌంట్‌ ఉండే అవకాశాలు ఉన్నాయని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Washing Powder Nirma: ఒకప్పుడు దేశాన్ని ఏలిన ‘నిర్మా’ ఇప్పుడు ఏమైపోయింది..? ఒక తప్పు వల్ల కనుమరుగు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి