WhatsApp Cashback: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు.. ఒక్కసారి పేమెంట్‌ చేస్తే..!

WhatsApp Cashback : వాట్సాప్‌.. ఈ పేరు తెలియని వారుండరు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు...

WhatsApp Cashback: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు.. ఒక్కసారి పేమెంట్‌ చేస్తే..!

Updated on: Sep 24, 2021 | 4:05 PM

WhatsApp Cashback : వాట్సాప్‌.. ఈ పేరు తెలియని వారుండరు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. ప్రతి ఒక్కరూ ఫోన్‌లో ఎక్కువగా ఉపయోగించేది వాట్సాప్‌ అనే చెప్పాలి. స్నేహితులతో ముచ్చట్లు, కుటుంబ సభ్యులతో సంభాషణలు, స్టేటస్‌లు ఇవన్నీ వాట్సాప్‌లోనే. యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తోంది. యూజర్లకు మరింత చేరువ అవుతోంది. తాజాగా ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు శుభవార్త చెప్పింది. వాట్సాప్ త్వరలోనే క్యాష్ బ్యాక్ ఆఫర్లు తీసుకురానుంది. పేటీఎం, ఫోన్ పే లతో పోటీ పడేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ విషయాన్ని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.

ఒక్కసారి పేమెంట్‌ చేస్తే..

వాట్సాప్ పేమెంట్ ఆప్షన్ ఉపయోగించి యూపీఐ ద్వారా డబ్బులు పంపే యూజర్ల కోసం క్యాష్ బ్యాక్ ఆఫర్లు తెస్తున్నట్లు తెలిసింది. ఒక్కసారి పేమెంట్ చేస్తే రూ.10 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, ఈ ఫీచర్ అందుబాటులోకి రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

వాట్సాప్‌ ఇటీవలే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామ్యంలో పేమెంట్‌ ఆప్షన్‌ను ఇండియన్‌ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఆ ఆప్షన్‌ను వినియోగించి యూజర్లు వాట్సాప్‌ ద్వారా 227 రకాల బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్‌ ఫర్‌ చేసుకోవచ్చు.

ఆర్ధిక లావాదేవీలను జరుపుకొనే ఫీచర్ కూడా వాట్సాప్ తీసుకువచ్చింది. ముందుగా భారత్, బ్రెజిల్ దేశాల్లో ఈ ఫీచర్ తెచ్చింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా భాగస్వామ్యంలో వాట్సాప్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్‌ పే తరహాలో మనీ ట్రాన్స్‌ ఫర్‌ చేసేందుకు రకరకాల ఆప్షన్లు ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి:

Festive Season: పండగ సీజన్‌లో సామాన్యులకు షాక్‌.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయ్‌..!

Smartphone Settings: మీ స్మార్ట్‌ఫోన్‌ స్లో అవుతుందా..? ఈ సెట్టింగ్స్‌ మార్చితే వేగవంతం అవుతుంది..!

IRCTC Ticketing Portal: ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో బగ్‌ను కనుగొన్న 17 ఏళ్ల విద్యార్థి..!