జీవితంలో పొదుపు అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. రాబడి, ఖర్చులు మాత్రమే కాక.. పొదుపునకు కూడా ప్రతి నెలా కొంత కేటాయించాలని ఆర్థిక నిపుణులు సైతం సూచిస్తుంటారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయని, వాటిని పాటించడం ద్వారా అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది. అలాంటి నియమాల్లో 50-30-20 ఒకటి. ఇది పనిని సులభతరం చేస్తుంది. దీని సాయంతో రేపటి గురించి చింతించకుండా మొదటి రోజు నుంచే పొదుపు మార్గంలో పయనించే అవకాశాన్ని ఇస్తుంది. ప్రధానం ఈ నియమం మీకొచ్చే రాబడి, ఖర్చులు, పొదుపులను విభజించడం ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో సాయపడుతుంది. ఈ నియమం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
50-30-20 నియమం అనేది మీ ఆదాయాన్ని మూడు విస్తృత వర్గాలుగా విభజించి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను సమర్థంగా నిర్వహించడంలో సహాయపడే ఒక సాధారణ బడ్జెట్ పద్ధతి. ఇది మీ ఆదాయం మొత్తాన్ని మూడు విభాగాలు చేస్తుంది. మీ నెలవారీ ఆదాయం నుంచి 50% మీ కుటుంబ అవసరాలకు ఖర్చు చేయాలి. అలాగే 30శాతం మీ కోరికల కోసం వినియోగించాలి. మరో 20శాతం పొదుపు కోసం వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టాలి. స్థూలంగా ఇదే 50-30-20 నియమం.
ఈ 50-30-20 నియమాన్ని యూఎస్ సెనేటర్, మాజీ హార్వర్డ్ లా ప్రొఫెసర్ అయిన ఎలిజబెత్ వారెన్, ఆమె కుమార్తె అమేలియా వారెన్ త్యాగితో కలిసి ప్రచారం చేశారు. వారు 2005లో తమ పుస్తకం “ఆల్ యువర్ వర్త్: ది అల్టిమేట్ లైఫ్‌టైమ్ మనీ ప్లాన్”లో ఈ నియమాన్ని పరిచయం చేశారు.
ఈ నియమం లక్ష్యం వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ కోసం సరళమైన, సులభంగా అనుసరించగల ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది. ఇది అన్ని వర్గాల వారికి అనుకూలమైన నియమం.
హౌసింగ్: అద్దె లేదా గృహ రుణ ఈఎంఐ (ముంబై లేదా ఢిల్లీ వంటి మెట్రో నగరంలో రూ. 10,000-రూ. 30,000).
కిరాణా: చిన్న కుటుంబానికి నెలకు రూ.4,000-రూ.10,000.
యుటిలిటీస్: విద్యుత్, నీరు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ బిల్లులు (రూ. 2,000-రూ. 5,000).
రవాణా: ప్రజా రవాణా లేదా కారు రుణ ఈఎంఐ, ఇంధన ఖర్చులు (రూ. 3,000-రూ. 10,000).
ఆరోగ్య సంరక్షణ: నెలవారీ ఆరోగ్య బీమా ప్రీమియం లేదా వైద్య ఖర్చులు (రూ. 1,000-రూ. 3,000).
నెలకు రూ. 50,000 సంపాదించే వ్యక్తికి, ఈ నిత్యావసరాలను కవర్ చేస్తూ 50% రూ. 25,000 అవుతుంది.
2.మీ కోరికలపై 30% (విచక్షణతో కూడిన వ్యయం).. వాంట్స్ అనేది మీ జీవనశైలిని మెరుగుపరిచే వస్తువులు. ఇవి వ్యక్తులను బట్టి మారుతుంటాయి. వీటిలో ఇవి ఉండవచ్చు
ఈ దృష్టాంతంలో, రూ. 50,000 సంపాదించే వ్యక్తికి, అటువంటి విచక్షణ ఖర్చుల కోసం 30% రూ. 15,000 అవుతుంది.
3. పొదుపులు, పెట్టుబడులపై 20%. ఈ భాగాన్ని మీ ఆర్థిక భవిష్యత్తును నిర్మించడానికి కేటాయించాలి, ఉదాహరణకు:
పొదుపులు: పొదుపు ఖాతా లేదా అత్యవసర నిధిలో సాధారణ డిపాజిట్లు.
పెట్టుబడులు: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొదలైనవి.
రుణ చెల్లింపు: కనీస చెల్లింపు కంటే ముందుగా రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం.
రూ. 50,000 నెలవారీ జీతం అయితే దానిలో 20% అంటే రూ. 10,000 అవుతుంది. ఇందులో ఇవి ఉండొచ్చు.
అత్యవసర నిధి: రూ. 2,000.
పెట్టుబడులు: మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్‌లో రూ. 5,000.
లోన్ ప్రీపేమెంట్: పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్‌ను ముందస్తుగా చెల్లించడానికి రూ. 3,000.
ఈ నియమం గురించి ఓ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం..
మెట్రో నగరమైన గురుగ్రామ్‌లో నివసిస్తున్న ఆనంద్ నెలకు రూ.60,000 సంపాదిస్తున్నాడు.
1. అవసరాలు (రూ. 30,000):
అద్దె: రూ. 15,000.
కిరాణా, యుటిలిటీస్: రూ. 10,000.
రవాణా: రూ. 3,000.
ఆరోగ్య సంరక్షణ: రూ. 2,000.
కోరికలు (రూ. 18,000):
భోజనం, వినోదం: రూ. 6,000.
ప్రయాణం: రూ. 7,000.
షాపింగ్: రూ. 5,000.
3. పొదుపులు, పెట్టుబడులు (రూ. 12,000):
మ్యూచువల్ ఫండ్స్/ఆర్డీ/ఎఫ్డీ/గోల్డ్: రూ. 5,000.
అత్యవసర పొదుపు: రూ. 3,000.
రుణాన్ని ముందస్తుగా చెల్లించడం లేదా ఎస్ఐపీ: రూ. 4,000.
50-30-20 నియమం సరళమైన, సమర్థవంతమైన బడ్జెట్ కు మార్గదర్శకం. అయితే దీనికి కొన్ని పరిమితులున్నాయి. జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవసరమైన ఖర్చులు 50% కంటే ఎక్కువ ఉండి.. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు ఇది సరిపడదు. అదే సమయంలో 20% కంటే ఎక్కువ ఆదా చేయగల అధిక-ఆదాయాన్ని ఆర్జించేవారికి కూడా ఇది సరిపడకపోవచ్చు. అలాగే మీరు మీ అవసరాలు, కోరికల మధ్య తేడాను గుర్తించడం కూడా ముఖ్యం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..