AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్సనల్ లోన్ కట్టకపోతే ఏమవుతుంది..? తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకులు ఏంచేస్తాయంటే..!

Personal Loan: అత్యవసర పరిస్థితుల్లో చేతిలో డబ్బు లేనప్పుడు మనలో చాలామందికి టక్కున గుర్తొచ్చే ఫస్ట్ ఆప్షన్ పర్సనల్ లోన్. ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టకుండానే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వస్తుండటంతో వీటిని తీసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ అప్పు పరిస్థితి ఏంటి? ఆ భారాన్ని కుటుంబ సభ్యులు భరించాల్సిందేనా? లేక బ్యాంకులు ఆ అప్పును మాఫీ చేస్తాయా? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పర్సనల్ లోన్ కట్టకపోతే ఏమవుతుంది..? తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకులు ఏంచేస్తాయంటే..!
What Happens To Personal Loan If Borrower Dies
Krishna S
|

Updated on: Nov 14, 2026 | 4:32 PM

Share

జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ప్రస్తుతం చాలామంది వ్యక్తిగత రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలాంటి హామీ లేకుండానే క్షణాల్లో లోన్లు లభిస్తుండటంతో వీటిని తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి పూర్తిగా తిరిగి చెల్లించకముందే దురదృష్టవశాత్తు మరణిస్తే ఏం జరుగుతుంది..? ఆ అప్పు భారం కుటుంబ సభ్యులపై పడుతుందా..? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ విషయంలో బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. హోమ్, వాహన లేదా బంగారు రుణాల మాదిరిగా పర్సనల్ లోన్‌కు ఎలాంటి ఆస్తి హామీ ఉండదు. అందుకే దీనిని అన్‌సెక్యూర్డ్ లోన్ అంటారు. రుణగ్రహీత మరణిస్తే, సురక్షిత రుణాల మాదిరిగా బ్యాంకులు నేరుగా వస్తువులను జప్తు చేయడం లేదా వేలం వేయడం ద్వారా డబ్బును వసూలు చేయలేవు. కానీ బకాయి మొత్తాన్ని రాబట్టుకోవడానికి బ్యాంకులు కొన్ని నిర్దిష్ట పద్ధతులను అనుసరిస్తాయి.

మొదట వీటి పరిశీలన

రుణగ్రహీత మరణించిన వెంటనే బ్యాంకు ముందుగా ఆ లోన్‌కు రుణ ఇన్సూరెన్స్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ బీమా ఉంటే, బకాయి మొత్తాన్ని బీమా సంస్థ నుంచే బ్యాంకు వసూలు చేసుకుని ఖాతాను మూసివేస్తుంది. ఇన్సూరెన్స్ లేని పక్షంలో ఆ లోన్‌కు కో అప్లికెంట్ లేదా గ్యారెంటర్ ఉన్నారేమో చూస్తుంది. ఒకవేళ ఉంటే చట్టప్రకారం ఆ బకాయిని చెల్లించే బాధ్యత వారిపైనే ఉంటుంది. వారు నిరాకరిస్తే బ్యాంకు చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడేలా ఫిర్యాదు చేస్తుంది.

వారసులు అప్పు కట్టాలా? ఆస్తుల నుంచి వసూలు ఎలా?

ఇన్సూరెన్స్, కో అప్లికెంట్, గ్యారెంటర్ ఎవరూ లేకపోతే.. మరణించిన వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తుల నుంచి బ్యాంకు బకాయిని వసూలు చేసుకునే వీలుంటుంది. అయితే చట్టబద్ధమైన వారసులు కేవలం వారసులైనంత మాత్రాన సొంత జేబులోంచి ఆ అప్పు కట్టాల్సిన అవసరం లేదు. లోన్ అగ్రిమెంట్‌లో ప్రత్యేకంగా ఏదైనా షరతు ఉంటే తప్ప, బ్యాంకులు వారసులను బలవంతం చేయలేవు. ఒకవేళ మరణించిన వ్యక్తి పేరు మీద ఎలాంటి ఆస్తులు లేకపోతే, బ్యాంకు ఆ మొత్తాన్ని నష్టంగా పరిగణించి రద్దు చేయాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యులు ఏం చేయాలి?

రుణగ్రహీత మరణించినప్పుడు కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా, వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించాలి. మరణ ధృవీకరణ పత్రం అవసరమైన ఇతర పత్రాలను సమర్పించాలి. ఆ తర్వాత బ్యాంకు నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఒకవేళ ఆస్తుల విలువ మేరకు లేదా స్వచ్ఛందంగా రుణాన్ని పూర్తిగా తీర్చివేస్తే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా బ్యాంకు నుంచి తప్పనిసరిగా నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏవైనా న్యాయపరమైన చిక్కులు ఎదురైతే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో