AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ప్రైవేట్ స్కూల్ పెట్టాలంటే ఎంత పెట్టుబడి అవసరం? కావాల్సిన అర్హతలేంటి?

ప్రైవేట్ ప్రైమరీ స్కూల్ స్థాపనకు ప్రాంతాన్ని బట్టి రూ.15 లక్షల నుంచి పలుకోట్ల వరకు పెట్టుబడి అవసరం కావచ్చు. వ్యక్తులు, ట్రస్టులు, సొసైటీలు లేదా సెక్షన్-8 కంపెనీలు పాఠశాలలను ప్రారంభించవచ్చు. విద్యాశాఖ అనుమతులు, ఆర్‌టీఈ నిబంధనలు, మౌలిక సదుపాయాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం వంటి ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.

Business Idea: ప్రైవేట్ స్కూల్ పెట్టాలంటే ఎంత పెట్టుబడి అవసరం? కావాల్సిన అర్హతలేంటి?
School
SN Pasha
|

Updated on: May 30, 2026 | 9:25 AM

Share

దేశంలో నాణ్యమైన విద్యకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ప్రైమరీ స్కూల్‌ల స్థాపనపై ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. విద్యారంగంలో సేవలందించడంతో పాటు దీర్ఘకాలిక వ్యాపార అవకాశంగా భావిస్తూ పలువురు ప్రైవేట్ పాఠశాలల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. అయితే ఒక ప్రైవేట్ ప్రైమరీ స్కూల్‌ను ప్రారంభించాలంటే పెట్టుబడి, అనుమతులు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన అవసరమని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ప్రైవేట్ ప్రైమరీ స్కూల్‌ను ఒక వ్యక్తి, ట్రస్ట్, సొసైటీ లేదా సెక్షన్-8 కంపెనీ ద్వారా స్థాపించవచ్చు. చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలను లాభాపేక్షలేని సంస్థ (నాన్‌ ప్రాఫిట్‌ ఎంటిటీ) రూపంలో నమోదు చేయడం అవసరం. అనంతరం స్థానిక విద్యాశాఖ, మున్సిపల్ లేదా పంచాయతీ అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది.

పెట్టుబడి విషయానికి వస్తే అది ప్రాంతం, భవనం, విద్యార్థుల సామర్థ్యం, అందించాలనుకునే సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న స్థాయిలో ప్రైమరీ స్కూల్‌ను ప్రారంభించడానికి రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు కావచ్చు. పట్టణ ప్రాంతాల్లో భూమి కొనుగోలు, భవన నిర్మాణం, తరగతి గదులు, ఫర్నిచర్, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఆటస్థలం, భద్రతా ఏర్పాట్లు, బస్సులు వంటి సౌకర్యాలను కల్పించాలంటే పెట్టుబడి రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల వరకు లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు.

అదనంగా ఉపాధ్యాయుల జీతాలు, పరిపాలనా సిబ్బంది ఖర్చులు, విద్యుత్, నిర్వహణ వ్యయాలు, మార్కెటింగ్ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. విద్యా హక్కు చట్టం (RTE), రాష్ట్ర విద్యాశాఖ నిర్దేశించిన భవన భద్రత, పారిశుద్ధ్యం, ఉపాధ్యాయుల అర్హతలు వంటి ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. విద్యారంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం వ్యాపార దృష్టితో కాకుండా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు వస్తే ప్రైవేట్ స్కూల్‌లు దీర్ఘకాలంలో మంచి పేరు, స్థిరమైన ఆదాయాన్ని అందించగలవు. అయితే ప్రారంభానికి ముందు సంబంధిత రాష్ట్ర విద్యా శాఖ నిబంధనలు, అనుమతుల ప్రక్రియ, ఆర్థిక ప్రణాళికపై సమగ్ర అధ్యయనం చేయడం అత్యంత అవసరం.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us