Vodafone Idea : యూజర్లకు సరికొత్త ఆఫర్ ప్రకటించిన Vodafone Idea.. ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌, డిస్నీ హట్‌స్టార్‌ ఉచితం..!

Vodafone Idea : టెలికాం కంపెనీలు యూజర్లకు బోర్ కొట్టకుండా కొత్త కొత్త ఆఫర్లను, ప్లాన్లను ప్రకటిస్తూ ఉంటాయి. వారు ఇతర

Vodafone Idea : యూజర్లకు సరికొత్త ఆఫర్ ప్రకటించిన Vodafone Idea.. ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌, డిస్నీ హట్‌స్టార్‌ ఉచితం..!
Vodafone Idea

Updated on: Aug 15, 2021 | 3:57 PM

Vodafone Idea : టెలికాం కంపెనీలు యూజర్లకు బోర్ కొట్టకుండా కొత్త కొత్త ఆఫర్లను, ప్లాన్లను ప్రకటిస్తూ ఉంటాయి. వారు ఇతర నెట్‌వర్క్‌వైపు మళ్లకుండా జాగ్రత్తపడుతుంటారు. తాజాగా వొడాఫోన్ ఐడియా సరికొత్త ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్ల కింద పేరు పొందిన ఓటీటీ కనెక్షన్లను ఉచితంగా అందిస్తుంది. వీఐ రెడ్‌ఎక్స్‌ ఫ్యామిలీ ప్లాన్ల పేరిట రెండు కొత్త పోస్ట్‌పెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రూ.1699, రూ.2299 ప్లాన్లను ప్రకటించింది.

1. వీఐ రూ. 1699 రెడ్‌ఎక్స్‌ ఫ్యామిలీ ప్లాన్‌ : వీఐ రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్ రూ. 1699 ఒక నెల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌ ను ముగ్గురు సభ్యులు వినియోగించుకోవచ్చు. పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, జాతీయ రోమింగ్ కాల్‌లు ఉంటాయి. అపరిమిత డేటా ప్రయోజనాలతో పాటు నెలకు 3,000 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ,డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్లను ఏడాదిపాటు ఉచితంగా పొందవచ్చు.

2. వీఐ రూ. 2299 రెడ్‌ఎక్స్‌ ఫ్యామిలీ ప్లాన్‌: వీఐ రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్ రూ. 2299 ఇది కూడా ఒక నెల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌ ఐదుగురు సభ్యులు వినియోగించుకోవచ్చు. పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, జాతీయ రోమింగ్ కాల్‌లు ఉంటాయి. అపరిమిత డేటా ప్రయోజనాలతో పాటు నెలకు 3,000 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ,డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్లను ఏడాదిపాటు ఉచితంగా పొందవచ్చు.

Jeff Bezos: కొంపముంచిన జెఫ్‌ బెజోస్‌ అంతరిక్షయానం.. గుడ్‌బై చెబుతున్న అమెజాన్ యూజర్లు.. ఎందుకంటే.!

Ramya Murder: గుంటూరు విద్యార్థిని రమ్యను హత్య చేసింది శశికృష్ణ..!.. వాగ్వాదం చేసిన కొద్దిసేపటికే హత్య

IND vs ENG 2nd Test Day 4 Live: మొదలైన నాలుగో రోజు ఆట.. బరిలోకి దిగిన రోహిత్, రాహుల్.. డ్రా దిశగా సాగనుందా..?