Bathroom Construction: బాత్రూం నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది..? పూర్తి లెక్కలు ఇవే..!

ఇందులో పేర్కొన్న ప్లాస్టింగ్ కూలీలు మినహా మొత్తం సివిల్ వర్క్ ఖర్చు సుమారు రూ.25,000. అదనపు, ఊహించని ఖర్చుల కోసం కొంత బఫర్ కలుపుకుంటే, 4x6 అడుగుల బాత్రూం సివిల్ నిర్మాణం (గోడలు, ప్లాస్టింగ్, స్లాబ్) కోసం సుమారు రూ.30,000 వరకు ఖర్చు అవుతుందని అంచనా వేయవచ్చు.

Bathroom Construction: బాత్రూం నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది..? పూర్తి లెక్కలు ఇవే..!
Bathroom Construction

Updated on: Sep 11, 2026 | 9:02 PM

Bathroom Construction Cost: ఒక చిన్న 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు గల బాత్రూం నిర్మాణం చేయాలనుకునే వారికి ప్లాన్‌ వర్తిస్తుంది. మొత్తం 24 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ బాత్రూం కోసం బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్, స్లాబ్ నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్, కూలీల ఖర్చులను వివరంగా పరిశీలిద్దాం. ఈ వివరాలు మేస్త్రీలు, బిల్డర్స్‌ అందించిన సమాచారం ప్రకారం అందిస్తున్నాము. అయితే ప్రాంతాలను బట్టి ఖర్చులో తేడా ఉండవచ్చు. ఈ అంచనా కేవలం సివిల్ నిర్మాణ పనులకు మాత్రమే వర్తిస్తుందని, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, టైల్స్, కమోడ్ సీట్, ట్యాప్స్, డ్రైనేజీ, వాటర్ ప్రూఫింగ్ వంటి ఇతర ఖర్చులు ఇందులో చేర్చబడలేదని గమనించాలి.

1. ఇటుక పని ఖర్చులు:

బాత్రూం గోడల నిర్మాణానికి సుమారు 750 ఇటుకలు అవసరమవుతాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఒక ఇటుకకు రూ.7 చొప్పున ఇటుకల ఖర్చు రూ.5,250 అవుతుంది. బ్రిక్ వర్క్‌కు సుమారు 3 బస్తాల సిమెంట్ అవసరం. ఒక బస్తా సిమెంట్ ధర రూ.300 చొప్పున, సిమెంట్ ఖర్చు రూ.900. ఇసుక విషయానికి వస్తే, ఒక ట్రక్కు ఇసుక అవసరం కావచ్చు. దీనికి సుమారు రూ.3,000 ఖర్చవుతుంది. దీనిని కట్టడానికి ఇద్దరు మేస్త్రీలు, నలుగురు హెల్పర్లు అవసరమవుతారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.1,000 చొప్పున, కూలీల ఖర్చు రూ.6,000 అవుతుంది.

బ్రిక్ వర్క్ మొత్తం ఖర్చు: రూ.5,250 (ఇటుకలు) + రూ.900 (సిమెంట్) + రూ.3,000 (ఇసుక) + రూ.6,000 (కూలీలు) = రూ.15,150.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Success Story: ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్ల ఆదాయం..!

2. ప్లాస్టింగ్ ఖర్చులు:

బాత్రూం లోపలి, బయటి ప్లాస్టింగ్ కోసం సుమారు 4 బస్తాల సిమెంట్ అవసరమవుతుంది. ఒక్కో బస్తాకు రూ.300 చొప్పున, ప్లాస్టింగ్ సిమెంట్ ఖర్చు రూ.1,200 అవుతుంది. ప్లాస్టింగ్ కూలీల ఖర్చులను ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ అంచనాలో ప్రత్యేకంగా చేర్చబడలేదు.

3. స్లాబ్ నిర్మాణ ఖర్చులు:

బాత్రూం పైన స్లాబ్ వేయడానికి సెంటరింగ్ ఖర్చు సుమారు రూ.3,000 అవుతుంది. స్లాబ్ పని చేసే వర్కర్ల కూలీకి మరో రూ.3,000 అవసరమవుతుంది. స్లాబ్ కోసం 2 బస్తాల సిమెంట్ కావాలి. దీనికి రూ.600 ఖర్చవుతుంది. అలాగే, 8mm స్టీల్ రాడ్ల కోసం సుమారు రూ.2,000 ఖర్చు అవుతుంది.
స్లాబ్ మొత్తం ఖర్చు: రూ.3,000 (సెంటరింగ్) + రూ.3,000 (వర్కర్లు) + రూ.600 (సిమెంట్) + రూ.2,000 (స్టీల్) = రూ.8,600.

మొత్తం సివిల్ నిర్మాణ ఖర్చులు (ప్లాస్టింగ్ కూలీలు మినహా):

  • బ్రిక్ వర్క్: రూ.15,150
  • రూ. ప్లాస్టింగ్ సిమెంట్: రూ.1,200
  • రూ. స్లాబ్: రూ.8,600
  • మొత్తం అంచనా: రూ.15,150 + రూ.1,200 + రూ.8,600 = రూ.24,950.

పైన పేర్కొన్న ప్లాస్టింగ్ కూలీలు మినహా మొత్తం సివిల్ వర్క్ ఖర్చు సుమారు రూ.25,000. అదనపు, ఊహించని ఖర్చుల కోసం కొంత బఫర్ కలుపుకుంటే, 4×6 అడుగుల బాత్రూం సివిల్ నిర్మాణం (గోడలు, ప్లాస్టింగ్, స్లాబ్) కోసం సుమారు రూ.30,000 వరకు ఖర్చు అవుతుందని అంచనా వేయవచ్చు.

ముఖ్య గమనిక: ఈ ఖర్చుల అంచనా కేవలం సివిల్ నిర్మాణం వరకు మాత్రమే. ప్లంబింగ్ పనులు, ఎలక్ట్రికల్ వైరింగ్, టైల్స్ వేయడం, కమోడ్ సీట్, వాష్ బేసిన్, ట్యాప్స్, షవర్ ఫిట్టింగ్స్, వాటర్ ప్రూఫింగ్, ఇతర ఫినిషింగ్ పనులకు అదనపు ఖర్చులు అవుతాయి. ఖర్చుల అంచనా ప్రాంతాన్ని బట్టి, మెటీరియల్స్ నాణ్యతను బట్టి మారుతూ ఉంటుంది.

ఇది కూడా చదవండి: Indian Railways: పండగల్లో రైలు ప్రయాణమా? కన్ఫర్మ్డ్ టిక్కెట్ కోసం ఈ సింపుల్ టిప్స్.. ఎవ్వరు చెప్పని సీక్రెట్స్!

ఇది కూడా చదవండి: Vinayaka Chavithi: వీధుల్లో భారీ వినాయకుడిని ఎందుకు పెడతారు? దీని వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us