Auto Expo 2023: మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఎలక్ట్రిక్‌ బైక్‌లు! ఆ టాప్‌ కంపెనీ నుంచి మరో కొత్త బైక్‌.. ఆటో ఎక్స్‌పోలోనే ప్రదర్శన

| Edited By: Anil kumar poka

Dec 31, 2022 | 3:12 PM

ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు తమ ఈ-బైక్‌లను ఎక్స్‌పోలో ప్రదర్శిస్తున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు టార్క్‌ మోటర్‌ కంపెనీ కూడా తన కొత్త వేరియంట్‌ను ఎక్స్‌పో ఉంచనున్నట్లు పేర్కొంది.

Auto Expo 2023: మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఎలక్ట్రిక్‌ బైక్‌లు! ఆ టాప్‌ కంపెనీ నుంచి మరో కొత్త బైక్‌.. ఆటో ఎక్స్‌పోలోనే ప్రదర్శన
Tork Kratos R
Follow us on

మన దేశంలో ఎలక్ట్రిక్‌ బైక్‌ల పరంపర కొనసాగుతోంది. కంపెనీలు తమ సరికొత్త మోడళ్లతో మార్కెట్‌కు క్యూ కడుతున్నాయి. దీనికి కొత్త సంవత్సరంలో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పో-2023ను వేదికగా చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు తమ ఈ-బైక్‌లను ఎక్స్‌పోలో ప్రదర్శిస్తున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు టార్క్‌ మోటర్‌ కంపెనీ కూడా తన కొత్త వేరియంట్‌ను ఎక్స్‌పో ఉంచనున్నట్లు పేర్కొంది. తమ సరికొత్త అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌ ఈ-బైక్‌ను క్రటోస్‌ ఆర్‌(kratos R) పేరిట ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఉన్న క్రటోస్‌ బండిని కూడా మళ్లీ రీ లాంచ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. దీని ధర మహారాష్ట్రలో మొదట రూ.1.32లక్షలుగా పెట్టగా.. ఇప్పుడు దానిని రూ. 1.47లక్షలు(ఎక్స్‌ షోరూం)కు విక్రయించనున్నట్లు చెబుతోంది.

టార్క్‌ మోటార్స్‌ ప్రస్థానం ఇలా..

ఈ టార్క్‌ మోటార్స్‌ కంపెనీ ఈ-బైక్‌ ల ప్రస్థానం చాలా ఆసక్తికరంగా ప్రారంభమైంది. తొలుత యమహా ఎఫ్‌జెడ్‌(Yamaha FZ) బండికి, ఎలక్ట్రిక్‌ మోటార్‌, బ్యాటరీని బిగించి దానిని ఎలక్ట్రిక్‌ బైక్‌గా మార్చేసింది. దీనిని రేసింగ్‌ కోసం కూడా వినియోగించింది. 2014లో వ్యాలీ రన్‌ పేరిట నిర్వహించిన రేస్‌లో ఈ ఆల్ట్రేషన్‌ బండిని వాడింది. ఇది 8.7 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్లు/గంటకు అందుకుంది. అలాగే టాప్‌ స్పీడ్‌ గంటకు 127 కిలోమీటర్లతో దూసుకెళ్లింది. దీనికి కొనసాగింపుగా తీసుకొచ్చిన క్రటోస్‌ బండి కూడా గంటకు 100 కిలోమీటర్లు టాప్‌ స్పీడ్‌ అందుకుంటుంది. ఇప్పుడు తీసుకొస్తున్న క్రటోస్‌ ఆర్‌ బండి అయితే గంటకు 105 కిలోమీటర్ల టాప్‌ స్పీడ్‌లో దూసుకెళ్లనుంది. అలాగే ఈ రెండు బండ్లు 3.5 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్లు/గంటకు వేగాన్ని అందుకుంటాయని టార్క్‌ కంపెనీ ప్రకటించింది.

కొత్త శకం..

ఈ సందర్భంగా టార్క్‌ మోటార్స్‌ సీఈవో కపిల్‌ షెల్కే మాట్లాడుతూ ఈ- మోటార్‌ సైకిల్‌ ప్రస్థానంలో సరికొత్త శకాన్ని తాము ప్రారంభించినట్లు పేర్కొన్నారు. క్రటోస్‌ బండ్లు వినియోగదారులకు ఆకట్టుకుందని, అలాగే కొత్త మోడల్‌ బండి క్రటోస్‌ ఆర్‌ కూడా వినియోగదారులకు అవసరమైన రీతిలో రూపొందించామని చెప్పారు. ఇది భారతదేశంలోని కస్టమర్లకు మరింతగా దగ్గరయ్యే ఏ అవకాశం ఉందని అంచానా వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..