AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Tips: రిస్క్‌ తక్కువ.. రాబడి ఎక్కువ.. ప్రభుత్వం అందించే 4 బెస్ట్ పొదుపు పథకాలు ఇవే

ప్రజలను ఆర్థికంగా బలపరిచేందుకు, ఆర్థిక భరోసా ఇచ్చేందు ప్రభుత్వాలు అనేక పొదుపు పథకాలను తీసుకొస్తుంది.వీటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా నిర్ణిత కాల వ్యవధిలో మంచి రాబడులను పొందచ్చు. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా మీ పెట్టబడులకు మంచి రాబడి వచ్చే పథకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Investment Tips: రిస్క్‌ తక్కువ.. రాబడి ఎక్కువ.. ప్రభుత్వం అందించే 4 బెస్ట్ పొదుపు పథకాలు ఇవే
Top 4 Government Savings Schemes
Anand T
|

Updated on: Sep 19, 2026 | 2:07 PM

Share

మీరు మీ దగ్గర ఉన్న డబ్బును ఇన్వెస్ట్ చేయాలన్నా, మార్కెట్‌లో వచ్చే ఒడిదుడుకులను తట్టుకొని మీ పెట్టుబడి సేఫ్‌గా ఉండాలన్నా.. ప్రభుత్వం అందించే చిన్న చిన్న పొదుపు పథకాలు మీకు చాలా బాగా ఉపయోగపడుతాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. పథకాన్ని బట్టి వీటిలో వడ్డీ రేటు, డిపాజిట్ లిమిట్, విత్‌డ్రా, రూల్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. వీటిలో మరో ప్లెస్ పాయింట్ ఏమిటంటే ఇవి ప్రభుత్వ పథకాలు కాబట్టి వీటిలో ఎలాంటి రిస్క్ ఉండదు. అంటే ఇవి పూర్తిగా సురక్షితమైన పెట్టుబడి. కాబట్టి మంచి రాబడిని ఇచ్చే 4 ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుందాం.

మీరు ఇన్వెస్ట్ చేయడానికి 4 బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: PPF అనేది దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఉపయోగించే ఒక ప్రభుత్వ పొదుపు పథకం.ఇందులో మీరు 15 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుండి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మీరు జమ చేయవచ్చు. ప్రస్తుతం PPF పై వడ్డీ రేటు సంవత్సరానికి 7.1 శాతంగా ఉంది. PPFలో వచ్చే వడ్డీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది, అలాగే ఈ రేట్లను ఎప్పటికప్పుడు మార్చే అవకాశం ఉంటుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ : ఇది కూడా ఓ బెస్ట్ పెట్టుబడి పథకం.. ఈ పథకం ద్వారా మీరు NSCని పోస్టాఫీసు ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీంట్లో మీరు ఐదేళ్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం NSC పై ఏడాదికి 7.7 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్‌ లోబడే మీ పెట్టుబడికి సంబంధించిన వడ్డీ రేట్లు ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుత పన్ను నిబంధనలను కూడా చూసుకోవడం ముఖ్యం.

సుకన్య సమృద్ధి ఖాతా : ఈ పథకం ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం తీసుకొచ్చింది. తల్లిదండ్రులు తమ అర్హత కలిగిన కూతురి పేరు మీద సుకన్య సమృద్ధి ఖాతాను ఓపెన్ చేసి పెట్టుబడి పెట్టవచ్చు.. ఈ అకౌంట్‌లో మీరు ఏడాదికి కనీసం రూ.250 నుండి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 8.2 శాతంగా ఉంది. ఈ పథకంలో కూతురి వయస్సు, ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రత్యేక నియమాలు వర్తిస్తాయి.

కిసాన్ వికాస్ పత్ర : ఇది కూడా పోస్టాఫీసుకు చెందిన ఒక చిన్న పొదుపు పథకం.ప్రస్తుతం దీనిపై సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. ఇందులో పెట్టిన పెట్టుబడి మొత్తం నిర్ణీత గడువు తర్వాత రెట్టింపు అవుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, KVP మెచ్యూరిటీ వ్యవధి వడ్డీ రేటు ఆధారంగా నిర్ణయిస్తున్నారు. కాబట్టి మీరు ఎలాంటి రిస్క్‌ లేకుండా మీ డబ్బును ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే.. ఈ నాలుగు పథకాలు చాలా బాగా ఉపయోగపడతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us