Personal loan: ఈ అంశాలు సరిచూసుకున్నాకే పర్సనల్ లోన్ కోసం వెళ్లండి.. లేకుంటే నష్టపోతారు..

|

Mar 27, 2024 | 6:24 AM

ముందుగా మనం ఆయా సంస్థలు లేదా వ్యక్తులు వసూలు చేసే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర నిబంధనలన్నింటినీ తెలుసుకోవాలి. ముఖ్యంగా వ్యక్తిగత రుణాల ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జీలు, అనుకోని కారణాలతో చెల్లింపులు ఆలస్యమైతే విధించే రుసుములు, ఇతర ఖర్చులన్నింటినీ గమనించాలి. లేకపోతే ఈఎంఐల కాలంలో నష్టపోయే ప్రమాదం ఉంది.

Personal loan: ఈ అంశాలు సరిచూసుకున్నాకే పర్సనల్ లోన్ కోసం వెళ్లండి.. లేకుంటే నష్టపోతారు..
Personal Loan
Follow us on

కుటుంబ అవసరాలు, వ్యాపార పెట్టుబడులు, ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మనం రుణాలు తీసుకుంటాం. సామాన్య, మధ్య తరగతి ప్రజలందరూ దాదాపు ఇలాంటి రుణాలపైనే ఆధారపడతారు. వీటిని తీసుకున్నాక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే అవసరాలు తీరడంతో పాటు వ్యాపారాలలో కూడా ప్రగతి సాధించవచ్చు. అయితే వ్యక్తిగత రుణాలను తీసుకునేటప్పుడు ఏ విషయాలను తెలుసుకోవాలి. రుణం కోసం ఎవరిని సంప్రదించాలి అనే అంశాలు చాలా ముఖ్యం. రుణాలు ఇవ్వడానికి చాలామంది రుణదాతలు, సంస్థలు సిద్ధంగా ఉంటాయి. ముందుగా మనం ఆయా సంస్థలు లేదా వ్యక్తులు వసూలు చేసే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర నిబంధనలన్నింటినీ తెలుసుకోవాలి. ముఖ్యంగా వ్యక్తిగత రుణాల ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జీలు, అనుకోని కారణాలతో చెల్లింపులు ఆలస్యమైతే విధించే రుసుములు, ఇతర ఖర్చులన్నింటినీ గమనించాలి. లేకపోతే ఈఎంఐల కాలంలో నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే పర్సనల్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాలను మీకు అందిస్తున్నాం.

వాయిదాలు సక్రమంగా చెల్లించగలరా?

రుణం తీసుకున్న తర్వాత మీరు నెలవారీ వాయిదాలను సక్రమంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చెల్లించగలరో లేదో తెలుసుకోవాలి. మీ నెలవారీ ఆదాయం, ఇతర ఖర్చులను లెక్కలు చూసుకోవాలి. ఖర్చులు పోను మిగిలిన సొమ్మును అంచనా వేసుకుని, రుణ వాయిదాలను చెల్లించే వీలున్నప్పుడు మాత్రమే లోన్ కోసం ముందుకు వెళ్లాలి.

క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం..

అన్నింటి కన్నా ముఖ్యమైనది మీ క్రెడిట్ స్కోర్. అది సక్రమంగా ఉండేలా చూసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రుణదాతలు ముందుగా మీ క్రెడిట్ రేటింగ్ ను పరిశీలిస్తారు. గతంలో మీరు తీసుకున్న రుణాలకు వాయిదాలను సక్రమంగా చెల్లిస్తే క్రెడిట్ రేటు బాగుంటుంది. దాని ఆధారంగా మీ చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. క్రెడిట్ రేటు బాగుంటే తక్కువ వడ్డీకి అధిక మొత్తం రుణం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి క్రెడిట్ స్కోర్ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు..

వ్యక్తిగత రుణాలపై వివిధ బ్యాంకులు, సంస్థలు వసూలు చేసే వడ్డీరేట్లలో మార్పులు ఉంటాయి. వీటిని పరిశీలించడం చాాలా ముఖ్యం. ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ, ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ పేమెంట్ ఫీజులు వంటి వన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ సరిచూసుకున్న తర్వాత ఏది అయితే అన్ని రకాలుగా మీకు ప్రయోజనకరంగా అనిపిస్తుందో ఆ బ్యాంకులో లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వడ్డీరేటు 10.5 శాతం నుంచి 24 శాతం వరకూ, అలాగే ప్రాసెసింగ్ ఫీజు 2.50 శాతం ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులో వడ్డీ రేటు 10.50 నుంచి 16 వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ చార్జీ 2.50 వసూలు చేస్తుంది. చోళ సంస్థ అందించే టర్బో లోన్లకు 14 శాతంవడ్డీరేటు, 4 నుంచి 6 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉన్నాయి. ఎస్ బ్యాంక్ 10.99 నుంచి 20 శాతం వడ్డీ, 2శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ 10.99 నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ చార్జీ 3శాతం ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ 10.49 నుంచి 22 శాతం వడ్డీ, 2 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 10.25 నుంచి 26 శాతం వడ్డీ, 3 శాతం ప్రాసెసింగ్ ఫీజు, హెచ్ ఎస్ బీసీ బ్యాంక్ 9.99 నుంచి 16శాతం వడ్డీ, 2శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ 10.49శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. 3.5 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. టాటా క్యాపిటల్ 10.99శాతం నుంచి వడ్డీ రేటు ఉంటుంది. 3.5 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. హోమ్ క్రెడిట్ క్యాష్ లోన్ 24 నుంచి 34శాతం వరకూ వడ్డీ రేటు, 2.5 నుంచి 5 శాతం ప్రాసెసింగ్ ఫీజులు వసూలు ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..