ఇటీవల కాలంలో గృహ రుణాలు తీసుకునే వారి సంఖ్య అధికమవుతోంది. సొంతింటి కోసమే, లేక ఉన్న ఇంటిని రీ మోడల్ చేసుకునేందుకనో గృహ రుణాలను తీసుకుంటున్నారు. అయితే గృహ రుణం అనేది దీర్ఘకాలిక భారం. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటారు కాబట్టి.. వాటిని తిరిగి ఈఎంఐల రూపంలో చాలా కాలం చెల్లించాల్సి ఉంటుంది. అసలు వడ్డీతో పాటు ఇది చెల్లించాల్సి ఉంటుంది. ఆ వడ్డీ రేటు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండదు. బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. పైగా వడ్డీ రేట్లలో కూడా రకాలుంటాయి. మూడు రకాల వడ్డీ రేట్లను బ్యాంకులు అందిస్తాయి. ఫ్లోటింగ్ వడ్డీ, ఫిక్స్ డ్ వడ్డీ, ఈ రెండింటి మిశ్రమంగా ఉండే వడ్డీ. ఆర్బీఐ రెపో రేటును బట్టి ఫ్లోటింగ్ వడ్డీ రేటు మారుతుంటుంది. అంటే రెపో రేటు తగ్గితే.. బ్యాంకుల్లో గృహ రుణ వడ్డీ రేటు కూడా తగ్గిస్తాయి. అయితే ఫిక్స్ డ్ రేటు ఉంటే.. లోన్ కాల వ్యవధి మొత్తం ఒకేలా ఉంటుంది. అదే సమయంలో రుణ గ్రహీతలకు వడ్డీ రేటు నిర్ణయించేటప్పుడు ప్రధానంగా ఆ వ్యక్తుల క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తం, ఎల్టీవీ నిష్పత్తి, ఉద్యోగం వంటి అనేక అంశాలను పరిగణనలోకి బ్యాంకులు తీసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఏ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ ఉంది? ఏ బ్యాంకులో లోన్ తీసుకుంటే మనకు ప్రయోజనం చేకూరుతుంది? తెలుసుకోవాలి. అందుకే మన దేశంలో తక్కువ వడ్డీ అందించే బ్యాంకుల గురించి తెలుసుకుందాం..
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గృహ రుణాలపై వడ్డీ రేట్లను ఇప్పుడు చూద్దాం.. వివిధ బ్యాంకుల్లో రూ. 75లక్షలకు పైగా రుణ మొత్తంపై వడ్డీ రేట్ల వివరాలు ఇవి..
ప్రైవేటు రంగ బ్యాంకుల్లో గృహ రుణాలపై వడ్డీ రేట్లను ఇప్పుడు చూద్దాం.. వివిధ బ్యాంకుల్లో రూ. 75లక్షలకు పైగా రుణ మొత్తంపై వడ్డీ రేట్ల వివరాలు ఇవి..
గృహ రుణానికి అనేక పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. మీకు గృహ రుణం ఉన్నట్లయితే, మీరు మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి వడ్డీ, అసలు చెల్లింపులను తీసివేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24 ప్రకారం, స్వీయ-ఆక్రమిత లేదా అద్దె ఆస్తుల యజమానులు రూ. లక్షల వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..