AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Splendor Plus 2025: ఆకర్షిస్తున్న స్ప్లెండర్ ప్లస్ నయా వెర్షన్.. సూపర్ ఫీచర్స్ తెలిస్తే షాక్..!

భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు సౌకర్యవంతమైన బైక్ అంటే స్ల్పెండర్ ప్లస్ అని టక్కున చెబుతున్నారు. మొదట్లో హీరో-హోండా బ్రాండ్ ద్వారా అందుబాటులో ఈ బైక్‌ను అనంతర పరిస్థితుల్లో హీరో కంపెనీ రిలీజ్ చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సూపర్ ఫీచర్స్‌తో ఈ బైక్‌ను అప్‌డేట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ బైక్ 2025 వెర్షన్‌ను కంపెనీ ప్రకటించింది.

Hero Splendor Plus 2025: ఆకర్షిస్తున్న స్ప్లెండర్ ప్లస్ నయా వెర్షన్.. సూపర్ ఫీచర్స్ తెలిస్తే షాక్..!
Hero Splendor Plus 2025
Nikhil
|

Updated on: Mar 14, 2025 | 11:39 AM

Share

హీరో మోటోకార్ప్ తన బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్ స్ప్రెండర్ ప్లస్‌ను అదిరే ఫీచర్స్‌తో అప్‌డేట్ చేసింది. 2025 హీరో సెండర్ ప్లస్ ఇటీవల హీరో డీలర్ల వద్దకు చేరింది. ముఖ్యంగా ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో ఈ బైక్‌ను అప్‌గ్రేడ్ చేశారు. అలాగే ఈ బైక్‌లో కొత్త కలర్ ఆప్షన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 2025 హీరో సెండర్ ప్లస్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే డిజైన్ ఉంది. అయితే ఫీచర్స్‌పరంగా కొన్ని ప్రధాన మార్పులు ఉన్నాయి. 2025 సెండర్ ప్లస్ స్పైషాట్ కనీసం మరో రెండు కొత్త కలర్ ఆప్షన్లతో వస్తుంది. గోల్డ్ డెకల్‌తో కూడిన ఎరుపు రంగులో ఉంంటే మరొకటి బూడిద రంగులో ఉంటుంది. ఈ కొత్త కలర్ స్కీమ్స్‌తో పాటు కొత్త సెండర్ ప్లస్ అప్‌డేటెడ్ బాడీ గ్రాఫిక్స్ కూడా వస్తుందని భావిస్తున్నారు.

2025 హీరో సెండర్ ప్లస్ హార్డ్ వేర్ అప్ గ్రేడ్ల విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఒక పెద్ద మార్పుగా ఉంటుంది. కొత్త హీరో సెండర్ ప్లస్‌ను ఫ్రంట్ డిస్క్ బ్రేక్ హీరో స్ప్రెండర్ ప్లస్ ఎక్స్ క్లో అందుబాటులో ఉంటుంది. అలాగే డిజిటల్ స్క్రీన్‌తో వచ్చే ఆధునిక వెర్షన్‌లా ఉంటుంది. డిస్క్ బ్రేక్ ఇప్పటికే ఉన్న డ్రమ్ బ్రేక్ సెటప్‌తో పోలిస్తే మెరుగైన బ్రేకింగ్ పవర్‌తో మోటార్ సైకిల్‌కు సంబంధించిన భద్రతా గుణాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. అయితే ఈ బైక్ వెనుక టైర్ డ్రమ్ బ్రేక్ సెటప్‌తో వస్తుంది. పవర్ ట్రెయిన్ విషయానికి వస్తే ముందు భాగంలో మోటార్ సైకిల్ 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ప్రస్తుత మోడల్స్ 7.91 బీహెచ్‌పీ పీక్ పవర్, 8.05 ఎన్ఎం గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2025 హీరో సెండర్ ప్లస్ స్పెసిఫికేషన్లు పెద్దగా మారకుండా ఉంటాయని భావిస్తున్నప్పటికీ ఇంజిన్ ఓబీడీ-2బీ నార్మ్ కంప్లైయన్స్‌తో అప్‌డేట్ ఉంటుంది. ట్రాన్స్‌మిషన్ డ్యూటీ కోసం మోటార్ సైకిల్ నాలుగు-స్పీడ్ గేర్ బాక్స్‌తో ఆకట్టుకుంటుంది. కొత్త సెండర్ ప్లస్ ఎప్పుడు విడుదల అవుతుందో? హీరో మోటోకార్ప్ ఇంకా వెల్లడించలేదు. హీరో సెండర్ ప్లస్ ప్రస్తుత ధర రూ.77,176  రూ.79,926 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటే, కొత్త సెండర్ ప్లస్ కొంచెం ఎక్కువ ధరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!