Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకపోతే అప్పుల్లో చిక్కుకోవడం పక్కా..

నేటి కాలంలో జేబులో డబ్బుల కంటే క్రెడిట్ కార్డులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెరిగిన ధరలు, మారుతున్న జీవనశైలికి తోడు ఆకర్షణీయమైన ఆఫర్లు ఉండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను మెయింటైన్ చేస్తున్నారు. అవసరానికి ఆదుకుంటాయి కదా అని తీసుకునే ఈ కార్డులు.. సరైన పద్ధతిలో వాడకపోతే మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకపోతే అప్పుల్లో చిక్కుకోవడం పక్కా..
How To Manage Multiple Credit Cards

Updated on: Feb 14, 2026 | 9:52 PM

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. జేబులో నగదు లేకపోయినా పనులు జరిగిపోతున్నాయి. కారణం..మనిషి దైనందిన జీవితంలో ఒక భాగమైపోయిన క్రెడిట్ కార్డు. పెరిగిన ధరలు, మారుతున్న జీవనశైలికి తగ్గట్టుగా అడగకముందే బ్యాంకులు ఆఫర్ చేస్తున్న ఈ మనీ ఇప్పుడు ప్రతి ఒక్కరి వాలెట్‌లోనూ కనిపిస్తోంది. అయితే అవసరానికి ఆదుకుంటాయి కదా అని ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను మెయింటైన్ చేస్తున్నారా? మల్టిపుల్ కార్డ్స్ ఉండటం గొప్ప విషయమే అయినా.. వాటిని మేనేజ్ చేయడంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీరు అప్పుల ఊబిలోకి జారిపోవడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ క్రెడిట్ కార్డు మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటోందా లేక సైలెంట్‌గా మీ సిబిల్ స్కోర్‌ను దెబ్బతీస్తోందా..? అసలు ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్నవారు పాటించాల్సిన ఆ గోల్డెన్ రూల్స్ ఏంటీ అనేది అందరూ తప్పక తెలుసుకోవడం చాలా ముఖ్యం..

ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే వచ్చే చిక్కులు ఇవే

పెనాల్టీల భారం: క్రెడిట్ కార్డు వాడటం ఎంత సులభమో, నెల నెలా బిల్లు కట్టడం అంత ముఖ్యం. ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్నప్పుడు వాటి డ్యూ డేట్స్ గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. ఒక్క రోజు ఆలస్యమైనా భారీగా లేట్ ఫీజులు, వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది.

క్రెడిట్ స్కోర్‌పై దెబ్బ: బిల్లు చెల్లింపులో చిన్న పొరపాటు జరిగినా అది నేరుగా మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో మీరు హోమ్ లోన్ లేదా కార్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది పెద్ద అడ్డంకిగా మారుతుంది.

అప్పుల జాబితాలోకి: సాధారణంగా క్రెడిట్ పరిమితిలో 30 శాతం లోపే ఖర్చు చేయడం మంచిది. కానీ ఎక్కువ కార్డులు ఉన్నాయి కదా అని ఇష్టానుసారం వాడేస్తే బ్యాంకులు మిమ్మల్ని అధిక అప్పులు తీసుకునే వ్యక్తిగా పరిగణిస్తాయి. ఇది మీ ఆర్థిక ప్రతిష్టను తగ్గిస్తుంది.

సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

సకాలంలో చెల్లింపు: ఎన్ని కార్డులు ఉన్నా, వాటి బిల్లులను గడువు తేదీ కంటే ముందే చెల్లించేలా ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకోవడం ఉత్తమం.

విడివిడిగా వాడండి: అన్ని అవసరాలకు ఒకే కార్డును వాడి లిమిట్ పూర్తి చేయడం కంటే వేర్వేరు కార్డులను విడివిడిగా వాడటం వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది.

పాక్షిక వినియోగం: కార్డులో అందుబాటులో ఉన్న పూర్తి మొత్తాన్ని ఎప్పుడూ వాడకండి. అందులో కొంత భాగాన్ని మాత్రమే అత్యవసరాలకు ఉపయోగిస్తే మీ క్రెడిట్ స్కోర్ భద్రంగా ఉంటుంది.