Tata Motors: R&D బలోపేతానికి టాటా మోటార్స్ ముమ్మర ప్రయత్నాలు.. ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్రగామిగా మారేందుకే..!

|

Jun 05, 2022 | 7:52 PM

Tata Motors: టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త రిక్రూట్‌మెంట్‌తో పాటు ఇప్పటికే ఉన్న ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి ద్వారా పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) సామర్థ్యాలను బలోపేతం చేయడానికి సిద్ధమవుతోంది.

Tata Motors: R&D బలోపేతానికి టాటా మోటార్స్ ముమ్మర ప్రయత్నాలు.. ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్రగామిగా మారేందుకే..!
Tata Motors
Follow us on

Tata Motors: టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త రిక్రూట్‌మెంట్‌తో పాటు ఇప్పటికే ఉన్న ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి ద్వారా పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) సామర్థ్యాలను బలోపేతం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల (EV) సెగ్మెంట్‌తో సహా వివిధ వ్యాపార వర్టికల్స్‌లో సామర్థ్యాన్ని పెంపొందించడం ప్రస్తుత చర్యల లక్ష్యమని తెలుస్తోంది. బ్యాటరీ ప్యాక్, వాహన రూపకల్పన పరంగా EV విభాగంలో నైపుణ్యాన్ని పెంచుకోవాలని కంపెనీ చూస్తోంది. ఇందుకోసం కొత్త ఉద్యోగుల రిక్రూట్ మెంట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. భారీ సంఖ్యలో కొత్త నియామకాలు చేయనున్నట్లు వెల్లడించింది.

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. “ఆర్ అండ్ డిలో రిక్రూట్‌మెంట్ విషయానికొస్తే, మేము ఈ సంవత్సరం ప్రత్యేకంగా బలమైన రిక్రూట్‌మెంట్‌ను కలిగి ఉన్నాము. ఈ విభాగంలో లోతుగా పని చేయడం అనేది R&Dలో ఉన్న ఇంజనీర్ల నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం” అని వెల్లడించారు.

కంపెనీ తన R&D బేస్‌ను అత్యంత సీరియస్‌గా విస్తరించాలని యోచిస్తోందని ఆయన తెలిపారు. సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి JLRతో సహా ఇతర గ్రూప్ సంస్థలతో సహకారం మెరుగుపడుతుందని శైలేష్ చంద్ర చెప్పారు. “జెఎల్‌ఆర్‌తో సహా వివిధ టాటా కంపెనీలతో అనేక టై-అప్‌లు ఉంటాయని అన్నారు. అందువల్ల, సామర్థ్యాలు కేవలం టాటా మోటార్స్‌కు మాత్రమే పరిమితం కావని అన్నారు. కానీ JLRతో సహా ఇతర టాటా కంపెనీలతో సినర్జీలకు అవకాశాలు కూడా పరిగణిస్తున్నట్లు తెలిపారు. సాఫ్ట్‌వేర్ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని, వాటిపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.