మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ ఉంటుంది జాగ్రత్త.. కొత్త రూల్స్ వచ్చేశాయి..

చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుంటాయి. అయితే మీరు వీటిని తీసుకునేముందు కొన్ని నిబంధనల గురించి తెలుసుకోవాలి. ఇవి ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. దీంతో ఆదాయపు పన్నుశాఖ నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరముంది.

మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ ఉంటుంది జాగ్రత్త.. కొత్త రూల్స్ వచ్చేశాయి..
Office Loan

Updated on: Nov 10, 2026 | 10:02 PM

కొన్ని కంపెనీలు ఉద్యోగులకు లోన్లు అందిస్తూ ఉంటాయి. శాలరీ అడ్వాన్స్, లోన్ రూపంలో వీటిని ఇస్తూ ఉంటాయి. వీటికి ఎలాంటి వడ్డీ అనేది ఉండదు. ఈఎంఐ రూపంలో మీ శాలరీ నుంచి ప్రతీ నెలా కట్ చేసుకుంటూ ఉంటుంది యాజమాన్యం. కొన్ని కంపెనీలు తక్కువ వడ్డీకే లోన్లు మంజూరు చేస్తుంటాయి. అయితే ఇవి బ్యాంకుల ద్వారా ఇచ్చే లోన్లు కాదు. తమ ఉద్యోగుల ఆర్ధిక అవసరాలు, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు యాజమాన్యం తమ సంస్థ ద్వారా ఈ రుణాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఈ రుణాలకు ట్యాక్స్ ఉంటుందా..? ఉండదా? అనేది చూద్దాం.

ఆఫీస్ ఇచ్చే లోన్లపై ట్యాక్స్ ఉంటుందా..?

ఈ లోన్లు ద్వారా లభించే వడ్డీ ప్రయోజనాలను అదనపు ఆదాయంగా పరిగణించి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పన్ను విధించే అవకాశాలున్నాయి. వడ్డీ లేకుండా లేదా మార్కెట్ రేటు కంటే తక్కువ వడ్డీకే లోన్ ఇస్తే పెర్క్విజిట్‌గా ఆదాయపు పన్నుశాఖ పరిగణిస్తుంది. అంటే జీతం కాకుండా అదనంగా కంపెనీ కల్పించే బెనిఫిట్‌గా పరిగణిస్తారు. దీంతో వీటికి ట్యాక్స్ వర్తిస్తుంది. రూ.20 వేల కంటే తక్కువ తీసుకుంటే మాత్రం పన్ను ఉండదు. అంతకంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఇలాంటప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు ఆధారంగా ట్యాక్స్ లెక్కిస్తారు. ఎస్బీఐ వడ్డీ రేటు ఆధారంగా లెక్కించిన వడ్డీ నుంచి ఉద్యోగంగా వాస్తవంగా చెల్లించిన వడ్డీని తీసివేస్తారు. ఇక మిగిలి సొమ్ముపై ట్యాక్స్ విధిస్తారు. అయితే అత్యవసర వైద్య చికిత్స కోసం అర్హత కలిగిన హాస్పిటల్స్‌ల్లో తీసుకున్న రుణాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. రుణ పరిమితి రూ. 20 వేలు దాటినప్పుడు వైద్య చికిత్సకి సంబంధించిన ట్యాక్స్ మినహాయింపు వర్తించకపోతే వడ్డీ ప్రయోజనాలను జీతం కింద పన్ను వర్తించే ఆదాయంగా ఆదాయపు పన్ను శాఖ పరిగణిస్తుంది.

ఎలా లెక్కిస్తారంటే..?

మీరు తీసుకున్న రుణానికి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వడ్డీ రేటు ప్రకారం లెక్కిస్తే రూ. 12 వేలు వడ్డీ చెల్లించాల్సి వచ్చిందనుకుందాం. అందులో ఉద్యోగి రూ. 4 వేలు చెల్లించినట్లయితే.. మిగతా రూ. 8 వేలుపై పన్ను వర్తించే అవకాశం ఉంటుంది. మీరు మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటుంటే ఈ నిబంధనల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. దీని వల్ల మీకు ఎలాంటి చిక్కులు ఐటీ శాఖ నుంచి ఉండవు. లేకపోతే ట్యాక్స్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us