AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Prices: షుగర్ ధరల నుంచి సామాన్యులకు ఊరట..కొద్ది రోజుల్లో దిగొచ్చే ఛాన్స్..

పంచదార ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. దీంతో కేంద్రం స్పందించి చర్యలు చేపట్టింది. బల్క్ వినియోగదారుల వద్ద పంచదార నిల్వలపై ఆంక్షలు విధించింది. అయితే త్వరలోనే షుగర్ ఉత్పత్తిని ముందుగానే ప్రారంభించాలని మిల్లర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంతో సరఫరా మెరుగుపడే అవకాశముంది.

Sugar Prices: షుగర్ ధరల నుంచి సామాన్యులకు ఊరట..కొద్ది రోజుల్లో దిగొచ్చే ఛాన్స్..
Sugar Prices
Venkatrao Lella
|

Updated on: Aug 21, 2026 | 2:50 PM

Share

సరఫరా తక్కువగా ఉండటం, పండుగల సీజన్ కావడంతో గత కొద్ది రోజులుగా పంచదార ధరలు పెరుగుతున్నాయి. పరిశ్రమల నుంచి ఉత్పత్తి తగ్గడంతో సరఫరాలో కొరత వల్ల పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌నివో ప్రభావం వల్ల చెరుకు ఉత్పత్తి తగ్గడం, ఈ-20 ఇథనాల్ పెట్రోల్‌లో చెరుకు ఉపయోగించడం వల్ల కూడా షుగర్ ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో కిలో పంచదార రూ.46.34గా ఉండగా.. ఇప్పుడు రూ.60కి చేరుకుంది. దీంతో ఈ ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బల్క్ వినియోగదారుల వద్ద పంచదార నిల్వలపై ఆంక్షలు విధించింది. నెలకు 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పంచదారను ముడిసరుకుగా వాడే ఏ బల్క్ వినియోగదారుడైనా.. 15 రోజులకు మించి నిల్వలు ఉంచుకోకూడదని ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లోకి ఉంటాయని పేర్కొంది.

సామాన్యులకు ఊరట

అయితే పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులకు ఊరట కలగనుంది. ఈ మేరకు ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోషియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సీజన్‌ చక్కెర ఉత్పత్తిని 15 నుంచి 20 రోజుల కంటే ముందే ప్రారంభించాలని నిర్ణయించింది. సెప్టెంబర్‌తో ఒక సీజన్ ముగియనుండగా.. అప్పటివరకు 4 మిలియన్ టన్నుల నిల్వలు ఉంటాయని అంచనా వేసింది. అక్టోబర్‌లో 2.4 నుంచి 2.5 మిలియన్ టన్నుల పంచదార వినియోగించబడవచ్చని, ఆ తర్వాత 1.5 మిలియన్ టన్నుల షుగర్ నిల్వలు ఉండవచ్చని తెలిపింది. కొత్త సీజన్ అక్టోబర్ 15 నుంచి 20 మధ్య ప్రారంభమవుతాయని, మిల్లులు షుగర్ ఉత్పత్తి చేయడం ప్రారంభమవుతుందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా అన్ని మిల్లులు నవంబర్ 15 నాటికి పని చేయడం మొదలుపెడతాయని స్పష్టం చేసింది. దీని వల్ల షుగర్ సరఫరా మెరుగుపడటం వల్ల ధరలు పెరిగే అవకాశముందని ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోషియేషన్ పేర్కొంది. అయితే ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం  కొన్ని పన్ను మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ధరలు పెరగడానికి కారణాలేంటి..?

షుగర్ ధరలు పెరగడం వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలో ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేసింది. ఈ సీజన్ ప్రారంభంలో ఎగుమతులు జరగ్గా.. సుమారు 8 లక్షల టన్నుల పంచదార ఎగుమతి జరిగింది. మే నెలలో దేశంలో కొరత పెరుగుతుందనే కారణంతో ఎగుమతులకు ఫుల్ స్టాఫ్ పడింది. ఇక ఈ 20 పెట్రోల్ కోసం వచ్చే ఏడాది సుమారు 258 లక్షల టన్నుల చక్కెర వినియోగం ఉంటుందని అంచనా. దీని కోసం 40 నుంచి 45 టన్నుల బఫర్ స్టాక్‌ను కూడా ఉంచుతున్నారు.

Follow Us
షుగర్ ధరల నుంచి బిగ్ రిలీఫ్.. మరికొద్ది రోజుల్లోనే..
షుగర్ ధరల నుంచి బిగ్ రిలీఫ్.. మరికొద్ది రోజుల్లోనే..
పెళ్లి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెళ్లి కూతురు జంప్!
పెళ్లి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెళ్లి కూతురు జంప్!
బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. కట్‌చేస్తే రంగంలోకి..
బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. కట్‌చేస్తే రంగంలోకి..
శ్రీవారికి మూడు నామాలు ఎందుకు? తిరుమల వెంకటేశ్వరుడి తిరునామం..
శ్రీవారికి మూడు నామాలు ఎందుకు? తిరుమల వెంకటేశ్వరుడి తిరునామం..
వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్.. మీ పిల్లలకు కూడా పెట్టండి!
వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్.. మీ పిల్లలకు కూడా పెట్టండి!
ఇంటి నిండా డబ్బుల కట్టలే.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం
ఇంటి నిండా డబ్బుల కట్టలే.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం
హైస్పీడ్‌ దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం!
హైస్పీడ్‌ దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం!
వీరు మట్టిని ముట్టినా బంగారమే.. ఈ రాశులు సెప్టెంబర్ మహారాజులు
వీరు మట్టిని ముట్టినా బంగారమే.. ఈ రాశులు సెప్టెంబర్ మహారాజులు
చెప్పిన మాట వినరు.. కష్టాల సుడిగుండంలో చుట్టుకునే రాశులివే
చెప్పిన మాట వినరు.. కష్టాల సుడిగుండంలో చుట్టుకునే రాశులివే
సాయంత్రం ఆకలికి ఈ హెల్తీ స్నాక్‌ ట్రై చేయండి.. 5 నిమిషాల్లో తయారీ
సాయంత్రం ఆకలికి ఈ హెల్తీ స్నాక్‌ ట్రై చేయండి.. 5 నిమిషాల్లో తయారీ