Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. ఈ తరుణంలో ధరలు దిగివస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి తగ్గుతూ.. వచ్చిన వెండి ధరలు మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.60,000లుగా ఉంది. అయితే.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లోనే వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ.60,000 వద్ద కొనసాగుతోంది.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,000 లుగా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 64,200లుగా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.60,000 గా కొనసాగుతోంది.
* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.60,000 లుగా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర రూ.64,200గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,200 లుగా కొనసాగుతోంది.
* విజయవాడలో వెండి ధర రూ. 64,200 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.64,200 లుగా ఉంది.
కాగా.. ఈ ధరలు మంగళవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: