AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గరిష్టం నుంచి రూ.1,35,000 తగ్గిన వెండి ధర! ఇప్పుడు కొంటే లాభమేనా?

వెండి ధరలు గరిష్ఠ స్థాయి నుంచి కిలోకు సుమారు రూ.1.35 లక్షల వరకు తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.2,64,900 వద్ద ఉంది. అంతర్జాతీయంగా కూడా ధరలు భారీగా దిద్దుబాటుకు గురయ్యాయి. భవిష్యత్తులో పారిశ్రామిక డిమాండ్‌తో ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లు, డాలర్‌ బలం కారణంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.

గరిష్టం నుంచి రూ.1,35,000 తగ్గిన వెండి ధర! ఇప్పుడు కొంటే లాభమేనా?
Silver
SN Pasha
|

Updated on: Aug 28, 2026 | 8:03 AM

Share

వెండి ధరలు 2026లో భారీ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. జనవరి 29న అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఔన్స్ ధర 121 డాలర్లకు పైగా ఆల్‌టైమ్‌ హైని తాకింది. మన కరెన్సీలో దాదాపు రూ.4 లక్షల పైనే. ఆ తర్వాత భారీగా దిద్దుబాటు రావడంతో ఏప్రిల్‌ నాటికి ధరలు 70 డాలర్లకు పడిపోయాయి. ఇప్పుడు మన దేశంలో వెండి ధర కిలో రూ.2,64,900 లుగా ఉంది. ఆల్‌టైమ్‌ హైతో పోలిస్తే వెండి ఇంకా గణనీయంగా తక్కువ స్థాయిలోనే ఉంది. ఆల్ టైమ్ హైతో పోల్చితే దాదాపు 1,35,000 ధర తగ్గింది.

ప్రస్తుతం ఎంత తగ్గింది?

ఆగస్టు 2026 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర ఔన్స్‌కు సుమారు 68–70 డాలర్ల స్థాయిలో ఉంది. అంటే జనవరి గరిష్ఠమైన 121 డాలర్లతో పోలిస్తే దాదాపు 42–44 శాతం వరకు తక్కువ. భారత మార్కెట్లో మాత్రం డాలర్‌-రూపాయి మారకం, దిగుమతి సుంకాలు, జీఎస్టీ, స్థానిక డిమాండ్‌ కారణంగా ధరల కదలిక భిన్నంగా ఉంటుంది. ఇటీవలి రిటైల్‌ అంచనాల ప్రకారం 999 స్వచ్ఛత వెండి కిలో ధర సుమారు రూ.2.5 లక్షల పరిధిలో ఉంది.

మళ్లీ ధర పెరిగే అవకాశాలున్నాయా?

వెండికి దీర్ఘకాలంలో కొన్ని సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. సిల్వర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకారం 2026లో ప్రపంచ వెండి మార్కెట్ వరుసగా ఆరో ఏడాది లోటులో ఉండే అవకాశం ఉంది. సరఫరా కంటే డిమాండ్‌ ఎక్కువగా ఉండటం ధరలకు మద్దతు ఇవ్వొచ్చు. అలాగే ఏఐ డేటా సెంటర్లు, ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ రంగాల్లో వెండి వినియోగం కొనసాగుతోంది.

తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయా?

అధిక ధరల కారణంగా ఆభరణాలు, వెండిపాత్రలు, సోలార్‌ రంగంలో వినియోగం తగ్గే అవకాశం ఉంది. అమెరికా వడ్డీ రేట్లు పెరిగితే లేదా డాలర్‌ బలపడితే వెండిపై ఒత్తిడి రావచ్చు. అందుకే స్వల్పకాలంలో మళ్లీ భారీ దిద్దుబాటు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. జేపీ మోర్గాన్‌ కూడా 2026లో వెండి ధరల అంచనాలను గత అంచనాల కంటే తగ్గించింది.

ఇప్పుడు వెండిలో పెట్టుబడి పెట్టాలా?

ప్రస్తుత స్థాయిల్లో ఒక్కసారిగా మొత్తం డబ్బును పెట్టుబడి పెట్టడం కంటే దశలవారీగా పెట్టుబడి పెట్టడం కొంత మెరుగైన విధానం. కనీసం 3–5 సంవత్సరాల కాలాన్ని లక్ష్యంగా పెట్టుకున్నవారికి వెండి ఒక డైవర్సిఫికేషన్‌ ఆస్తిగా ఉపయోగపడొచ్చు. అయితే వెండి బంగారం కంటే ఎక్కువగా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. కాబట్టి అత్యవసర నిధులు, అప్పుల చెల్లింపుల తర్వాతే పెట్టుబడిని పరిగణించడం మంచిది.

Follow Us