AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BMW S1000R : భారత్‌లో లాంఛ్ అయిన ఈ బైక్ ధర అక్షరాలా రూ.20 లక్షలు!

బీఎండబ్ల్యూ నుంచి కొత్తగా లాంఛ్ అయిన బైక్ ధర అక్షరాలా రూ. 20 లక్షలు. బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ గంటకు 250 కిలోమీటర్ల స్పీడ్ ను అందుకోగలదు. ఇంకా ఈ బైక్ లో చాలానే స్పెషాలిటీస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

BMW S1000R : భారత్‌లో లాంఛ్ అయిన ఈ బైక్ ధర అక్షరాలా రూ.20 లక్షలు!
Bmw S 100r
Nikhil
|

Updated on: Sep 15, 2025 | 5:23 PM

Share

బీఎండబ్ల్యూ నుంచి రేసింగ్ బైక్ ఎస్ 1000 ఆర్ రిలీజైనంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.రూ. 19.90 లక్షలు.  ఇది  999సీసీ, లిక్విడ్-కూల్డ్, నాలుగు సిలిండర్ల ఇంజిన్‌తో పనిచేస్తుంది.  ఇది 170 బీహెచ్ పీ హార్స్ పవర్, 114 ఎన్ ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కేవలం 3.2 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు.

ఫీచర్లివే..

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ బైక్‌లో డేటైమ్ రైడింగ్ లైట్లు, క్విక్ యాక్షన్ థ్రాటిల్, ఏబీఎస్(ABS) ప్రో, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్లున్నాయి. అలాగే బ్లూటూత్  కనెక్టివిటీ, నావిగేషన్‌తో కూడిన 6.5-అంగుళాల టీఎఫ్ టీ (TFT) డిస్‌ప్లే ఉంటుంది. బీఎండబ్ల్యూ యాప్ ద్వారా టర్న్ -బై -టర్న్ నావిగేషన్ పొందొచ్చు.  రెయిన్, రోడ్, డైనమిక్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి.  అలాగే ఈ  బైక్‌లో బీఎండబ్ల్యూ ఇంటెలిజెంట్ ఎమర్జెన్సీ కాల్ ఫీచర్ , సీటు కింద ఉన్న యూఎస్ బీ  టైప్ సీ ఛార్జర్ ఉన్నాయి. . ఈ బైక్ బరువు199 కిలోగ్రాముల ఉంటుంది. సీట్ హైట్ 830ఎంఎం, వీల్ బేస్1,447ఎంఎం ఉంటుంది. ఫ్యుయెల్ ట్యాంక్ కెపాసిటీ 16.5 లీటర్లు.

డిజైన్..

ఈ బైక్ డిజైన్ విషయానికొస్తే.. ఇది నేక్డ్ రోడ్‌స్టర్ డిజైన్‌ తో ఉంటుంది. వేగంగా దూసుకెళ్లేందుకు వీలుగా ఏరో డైనమిక్స్ ఉంటాయి. ముందుభాగం హెవీగా  వెనుక భాగం పొట్టిగా ఉంటుంది. మూడు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి . బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, బ్లూఫైర్ ఎల్లో, లైట్‌వైట్ వంటి కలర్స్ లో వస్తుందిఇండియాలో ఈ బైక్ మూడు సంవత్సరాల వారంటీతో వస్తుంది. దీన్ని ఐదు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు.  దేశవ్యాప్తంగా 24×7 రోడ్‌సైడ్ సహాయం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం