ఫ్రిడ్జ్ రోజుకు ఎన్ని యూనిట్ల కరెంట్ వాడుతుంది..? ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు పడిపోవడం పక్కా..
ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా రిఫ్రిజిరేటర్ వాడుతుంటారు. ఫ్రిడ్జ్ ఎప్పుడూ ఆన్ చేసి ఉంచాల్సి రావడం వల్ల కరెంట్ ఎక్కువ వాడుతుంది. కరెంట్ బిల్లులో ఎక్కువ భాగం దీని వాటానే ఉంటుంది. అయితే రోజుకు ఫ్రిడ్జ్ ఎంత కరెంట్ వాడుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్(ఫ్రిడ్జ్) అనేది తప్పనిసరిగా ఉంటుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇళ్లల్లో కూడా సర్వసాధారణంగా ఉపయోగిస్తున్నారు. కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడంతో పాటు తాగునీటిని చల్లబర్చడం కోసం అందరూ వినియోగిస్తుంటారు. ఇక వేసవికాలంలో అయితే ఫ్రిడ్జ్ అనేది చాలా అవసరం. ఫ్రిడ్జ్ చూస్తే నిరంతరం పని చేయాల్సి ఉంటుంది. కొద్దిసేపు ఆఫ్ చేసినా లోపలి ఆహార పదార్థాలు చెడిపోయే అవకాశముంటుంది. దీంతో ఫ్రిడ్జ్ ఎప్పుడూ పని చేయాల్సి ఉండటం వల్ల విద్యుత్ కూడా ఎక్కువ ఖర్చవుతుంది. మీ నెలవారీ కరెంట్ బిల్లులో దీని వాటా ఎక్కువ ఉంటుంది.
రోజుకు ఎన్ని యూనిట్లు ఖర్చు చేస్తుందంటే..?
ఫ్రిడ్జ్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి రోజుకు సగటున ఒకటి నుండి రెండు యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించుకునే అవకాశముంది. అంటే 30 రోజులకు 30 నుంచి 60 యూనిట్ల వరకు విద్యుత్‌ను వాడుకుంటుంది. అయితే అన్నీ ఫ్రిడ్జ్‌లు ఒకేలా విద్యుత్‌ను ఉపయోగించుకోవు. మినీ ఫ్రిడ్జ్, సింగిల్ డోర్, డబుల్ డోర్ ఇన్వర్టర్ మోడళ్లను బట్టి కరెంట్ వినియోగం ఉంటుంది. ఇన్వర్టర్ కంప్రెసర్లతో కూడి రిఫ్రిజిలేటర్లు పాక్షిక లోడ్ సమయంలో చాలా తక్కువగా కరెంట్ ఉపయోగించుకోవడంతో పాటు సర్దుబాటు చేసుకుంటాయి. స్టాండర్డ్ కంప్రెసర్లు పూర్తి శక్తిని ఉపయోగించుకుంటాయి. ఇక బీఈఈ స్టార్ రేటింగ్‌ను బట్టి మీ ఫ్రిడ్జ్ విద్యుత్ వినియోగం మారుతుంది. 4-స్టార్, 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిజ్‌లు తక్కువ విద్యుత్‌తో పనిచేస్తాయి. దీని వల్ల మీ కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. ఇక మీ ఫ్రిడ్జ్ రకంను బట్టి కూడా విద్యుత్ వినియోగం జరుగుతుంది. మినీ ఫ్రిడ్జ్ 25 నుంచి 100 వాట్స్ విద్యుత్ వినియోగించుకుంటే.. సింగిల్ డోర్ 150 నుంచి 300 వాట్స్, డబుల్ డోర్ 200 నుంచి 500 వాట్స్, టాప్ ఫ్రీజర్ 40 నుంచి నుంచి 60 వాట్స్, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ 150 నుంచి 280 వాట్స్ విద్యుత్ వినియోగించుకోవచ్చు. ఈ అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా మీ ఇంట్లోని రిఫ్రిజిరేటర్ ఎంత విద్యుత్ వినియోగించుకుంటుంది? దాని వల్ల ఎంత బిల్లు వస్తుంది? అనేది సులువగా తెలుసుకోవచ్చు.
బిల్లు తగ్గించుకోవాలంటే..?
-వేడిగా ఉన్న ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టవద్దు
-మీరు ఫ్రీజర్‌ను ఉపయోగించకపోతే ఆఫ్ చేయండి
-తలుపులు తెరవడాన్ని తగ్గించండి
-ఫ్రిజ్‌ను గోడకు ఆనించి ఉంచకూడదు. కాస్త దూరంగా పెట్టాలి. దీని వల్ల వేడి బయటకు పోతుంది
-ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫ్రిజ్ ప్లగ్ తీసి వెనుక లేదా కింద ఉన్న కండెన్సర్ కాయిల్స్‌పై పేరుకుపోయిన దుమ్మును క్లీన్ చేయండి
-గ్యాస్ స్టవ్, ఓవెన్ లాంటి పరికరాల పక్కన ఫ్రిడ్జ్ పెట్టకండి
