Telugu News Business RBL bank gifts to crore of customer increase interest rate on fixed deposit latest fd rates
Bank Deposits: ఈ బ్యాంకులో డిపాజిట్లు చేసే కోట్లాది మంది ఖాతాదారులకు గుడ్‌న్యూస్
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వినియోగదారుల కోసం రకరకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటాయి. ముఖ్యంగా వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తుంటాయి.
దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్ ఆర్‌బీఎల్ (RBL) రూ. 3 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఆర్‌బీఎల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీని అందిస్తోంది. ఆర్‌బీఎల్ బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు గరిష్టంగా 7.10%, సీనియర్ సిటిజన్లకు 7.65% వడ్డీని అందిస్తోంది. ఈ కొత్త రేట్లు జూలై 29, 2024 నుండి అమలులోకి వచ్చాయి.