AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ సడెన్ షాక్.. అమల్లోకి రానున్న కఠిన రూల్స్.. ఇలా అయితే కష్టమే..

ఆర్బీఐ రుణ దరఖాస్తులకు సంబంధించి కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తోంది. 2027 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్‌ను అమలు చేయనుంది. వీటి ప్రభావంతో సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నవారికి రుణాలు పొందటం ఇక కష్టమే. రుణాలు డిఫాల్టర్లను తగ్గించేందుకు ఆర్బీఐ కొత్త నిర్ణయాలు అమలు చేయనుంది.

RBI: లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ సడెన్ షాక్.. అమల్లోకి రానున్న కఠిన రూల్స్.. ఇలా అయితే కష్టమే..
Loan
Venkatrao Lella
|

Updated on: Jun 11, 2026 | 6:37 PM

Share

మీ క్రెడిట్ స్కోర్ 730 కంటే తక్కువగా ఉందా..? అయితే మీకు లోన్లు రావడం ఇక కష్టం కావొచ్చు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిబంధనలను అమల్లోకి తీసుుకురానుంది. ఎక్స్‌పెక్టె‌డ్ క్రెడిట్ లాస్ పేరుతో కొత్త రూల్స్‌ను ఆర్బీఐ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచిఈ కొత్త నిబంధనలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నియమాలతో 730 కంటే సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వారికి రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు మరింత కఠి నిబంధనలు విధించారు. దీంతో క్రెడిట్ హిస్టరీ సరిగ్గా లేకపోయినా, తక్కువగా ఉన్నా రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

సిబిల్ తక్కువుంటే రుణం కష్టమే

ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ECL) డైరెక్షన్-2026 ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్బీఐ వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఇది బ్యాంకింగ్ రంగంలో ఒక కీలకమైన సంస్కరణగా చెప్పవచ్చు. ఈ సంస్కరణల ప్రకారం 730 కంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారు రుణాలు పొందే విషయంలో కఠినమైన పరిశీలనను ఎదుర్కొంటారు. అధిక వడ్డీ రేట్లు, అదనపు పూచీకత్తు సమర్పించడం వంటి సమస్యలు రావొచ్చు. దేశంలోని రుణ దరఖాస్తుదారులలో 62 శాతం మంది ఈ వర్గంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత వ్యవస్థ ప్రకారం బ్యాంకులు రుణ డిఫాల్ట్‌లు జరిగిన తర్వాతే స్పందిస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు భవిష్యత్ డేటాను ఉపయోగించి రుణగ్రహీత రిస్క్‌ను నిరంతరం అంచనా వేస్తాయి. ఈఎంఐ ఆలస్యంగా చేయడం, అస్థిరమైన ఆదాయ సరళి, క్రెడిట్ వినియోగంలో ఆకస్మిక పెరుగుదల వంటి వాటిని పరిగణలోకి తీసుకుని పూర్తిగా రుణ దరఖాస్తులు తిరస్కరించవచ్చు.

రానున్న రోజుల్లో కష్టమే

కొత్త రూల్స్ వల్ల 730 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న సుమారు 7 కోట్ల ప్రీమియం కస్టమర్లకు బ్యాంకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. వీరికి బహుమతులు అందించడంతో పాటు పోటీతత్వంతో కూడిన ఆర్థిక ఉత్పత్తుల పూర్తి శ్రేణితో సేవలు అందిస్తారు. మిగతా అందరికీ రుణం అందటం కష్టంగా మారవచ్చు. అయితే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు, స్టెప్-అప్ లోన్ ఉత్పత్తులు, సూక్ష్మ రుణ మార్గాలు వంటి వాటిని తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారి కోసం అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం బ్యాంకులు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా తమకు నమ్మకమైన కస్టమర్‌గా ఎక్కువకాలం పాటు కొనసాగుతుంటే రుణాలు మంజూరు చేస్తున్నాయి. కానీ రానున్న రోజుల్లో ఈ విధానంలో రుణాలు పొందటం కష్టం కావొచ్చు. ఆర్బీఐ నియమాలు అందుకు అనుమతించవు.

Follow Us