AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: మీ బ్యాంక్ అకౌంట్ ఇతరులకు ఇస్తున్నారా..? జైలుకు పోక తప్పదు.. ఆర్బీఐ హెచ్చరిక ఇదే..

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఇతరుల అకౌంట్లను సంపాదించి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నాయి. ఆ అకౌంట్ల ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. కొంతమంది ఖాతాదారులు డబ్బుల కోసం తమ బ్యాంక్ అకౌంట్‌ను అక్రమార్కులకు అప్పగించేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ఆర్బీఐ అవగాహన కల్పిస్తోంది.

RBI: మీ బ్యాంక్ అకౌంట్ ఇతరులకు ఇస్తున్నారా..? జైలుకు పోక తప్పదు.. ఆర్బీఐ హెచ్చరిక ఇదే..
Bank Account
Venkatrao Lella
|

Updated on: Jun 13, 2026 | 4:21 PM

Share

మీ బ్యాంక్ అకౌంట్‌ను వేరేవారు ఉపయోగించుకునేందుకు ఇస్తున్నారా..? డబ్బులు ఇస్తామనే ఆశ చూపడంతో అకౌంట్ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు డబ్బుల ఆశ చూపి ఇతరుల అకౌంట్లను తీసుకుంటున్నారు. కొంతమంది ప్రజలు డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో తమ బ్యాంక్ ఖాతాను వారికి అప్పగిస్తున్నారు. కానీ ఇలా ఇవ్వడం బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం నేరం. మీ అకౌంట్ నుంచి ఇతరులు నేరాలకు పాల్పడితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ మీ పేరు మీద ఉండి గనుక ఆ అకౌంట్ ద్వారా జరిగే అన్ని కార్యకలాపాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను ఆర్బీఐ హెచ్చరించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

మ్యూల్ అకౌంట్స్

దేశంలో మ్యూల్ అకౌంట్ పెరిగిపోతున్నాయి. ఇతరుల అకౌంట్ నుంచి అక్రమ లావాదేవీలు చేయడాన్ని మ్యూల్ అకౌంట్‌గా పిలుస్తారు. ఇలాంటి మోసాలు ఇటీవల పెరిగిపోతున్న క్రమంలో ప్రజలు ఆర్బీఐ అలర్ట్ చేస్తోంది. ఈ మేరకు తాజాగా పలు సూచనలు జారీ చేసింది. డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు అకౌంట్‌ను ఇతరులకు ఇవ్వవద్దని ఆర్బీఐ హెచ్చరించింది. మీ బ్యాంక్ ఖాతా ద్వారా డబ్బును పొందడానికి లేదా పంపించడానికి ఇతరులకు అనుమతిస్తే మీరు జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లను ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దని సూచించింది. “మీ ఖాతాను కాపాడుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సులభంగా వచ్చే డబ్బు కోసం రిస్క్ తీసుకోవడం ఎప్పటికీ మంచిది కాదు మరింత సమాచారం కోసం https://rbikehtahai.rbi.org.in/telugu/index.htmlపై క్లిక్ చేయండి” అంటూ ఆర్బీఐ సూచించింది.

జైలుకు వెళ్లే ప్రమాదం

మీరు డబ్బులకు ఆశ పడి ఇతరులకు మీ అకౌంట్ ఇస్తే.. వాళ్లు మీ ఖాతా నుంచి అక్రమ లావాదేవీలు నిర్వహించే అవకాశముంటుంది. ఇలాంటి సమయంలో మీరే రిస్క్‌లో పడతారు. మీ ఖాతా ద్వారా ఇల్లీగల్ లావాదేవీలు చేసే అవకాశముంటుంది. బెట్టింగ్ యాప్స్, క్యాసినో, క్రిప్టో కరెన్సీ లాంటివి నిర్వహించేవారు ఇతరుల అకౌంట్లు ఉపయోగించి లావాదేవీలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఖాతాదారుడు ఇబ్బందుల్లో పడతాడు. దేశవ్యాప్తంగా అనేక మ్యూల్ ఖాతాలు బయటపడుతున్నాయి. దీంతో పోలీసులు ఎప్పటికప్పుడు వీటిపై నిఘా పెడుతున్నారు. మ్యూల్ ఖాతాలపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఇలా ఇచ్చేవారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

Follow Us