వచ్చే ఏడాది ప్రజలపై ఆర్థకంగా భారం పడనుంది. ఇప్పటికే పలు వస్తువుల ధర పెరగ్గా వచ్చే మరిన్ని వస్తువుల ధర పెరగనున్నాయి. జనవరి నుంచి దుస్తులు, పాదరక్షలు మరింత ప్రియం కానున్నాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును 5% నుంచి 12%కి పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నోటిఫై చేయడంతో వచ్చే ఏడాది నుంచి దుస్తులు, వస్త్రాలు, పాదరక్షల ధరలు పెరగనున్నాయి. కేటగిరీలపై పెంచిన GST రేటు జనవరి 1, 2022 నుంచి వర్తిస్తుంది. అయితే, నిర్దిష్ట సింథటిక్ ఫైబర్‌లు, నూలుపై GST రేట్లు 18% నుంచి 12%కి తగ్గించారు.
సెప్టెంబరులో జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో టెక్స్‌టైల్, పాదరక్షలపై విధించే వస్తు సేవల పన్నును సవరించారు. జనవరి1 నుంచి దుస్తులపై GST రేటు 12% ఉంటుంది. ఇంతకుముందు ఇది దుస్తులు ధరపై జీఎస్టీ 5%గా ఉండేది. వచ్చే ఏడాది నుంచి ప్రధానంగా ఆన్లైన్ ద్వారా అందించే సేవలపైన ఇ-కామర్స్ సంస్థలు పన్ను చెల్లించాలి.
పరిశ్రమల సంఘం దుస్తుల తయారీ సంఘం (CMAI) జనవరి 1 నుండి దుస్తులపై అధిక జిఎస్‌టితో తీవ్ర నిరాశకు గురిచేసిందని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ M S మణి అన్నారు. ముడి పదార్థాలు, నూలు, ప్యాకింగ్ మెటీరియల్, సరుకు రవాణా ధరలతో పరిశ్రమ ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో పన్ను పెంపుదల జరిగింది. జీఎస్‌టీ లేకపోయినా మార్కెట్‌లో 12-15% ధరలు పెరుగుతాయని అంచనా వేసినట్లు ఇండస్ట్రీ బాడీ తెలిపింది.
పాదరక్షలు, వస్త్ర రంగాల్లో విలోమ పన్ను నిర్మాణంలో దిద్దుబాటు అమల్లోకి వస్తుంది. ఫలితంగా ధరలతో సంబంధం లేకుండా అన్ని పాదరక్షలు 12 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. రెడీమేడ్ దుస్తులు సహా అన్ని వస్త్ర ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ చెల్లించాలి. అయితే కాటన్‌కు మినహాయింపు ఉంది. ఇ-కామర్స్ సంస్థలు అందించే సేవలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉబర్, ఓలా, రాపిడో సంస్థలు.. క్యాబ్, ఆటోరిక్షా, బైక్‌ల ద్వారా ప్రయాణికులకు అందించే సేవలపై 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఆఫ్‌లైన్‌లో క్యాబ్, ఆటోరిక్షా ద్వారా ప్రయాణించేవారికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. స్విగ్గీ, జొమాటో వంటి ఇ-కామర్స్ సర్వీస్ ప్రొవైడర్లు.. రెస్టారెంట్ సేవలపై జీఎస్టీని సేకరించి, ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. అలాగే బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ బాధ్యతను రెస్టారెంట్లు నిర్వహించేవి. ఇకపై ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు నిర్వహిస్తాయి.
Read Also.. Petrol diesel prices today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..