
ఫోన్ వేడెక్కడం (ఓవర్‌హీటింగ్) సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా వేసవికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అయితే కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొదటగా ఫోన్‌ను ఎప్పుడూ నేరుగా ఎండలో లేదా అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో ఉంచకూడదు. ఇది బ్యాటరీపై ఒత్తిడిని పెంచి, వేడి పెరగడానికి కారణమవుతుంది. అలాగే ఫోన్ ఛార్జింగ్ సమయంలో గేమ్స్ ఆడటం లేదా భారీ యాప్స్ ఉపయోగించడం తప్పించుకోవాలి. ఈ సమయంలో ప్రాసెసర్‌పై లోడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఫోన్ త్వరగా వేడెక్కుతుంది.
అదనంగా అవసరం లేని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుంటే అవి కూడా ఫోన్‌ను వేడెక్కిస్తాయి. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా క్లోజ్ చేయడం మంచిది. ఫోన్ స్టోరేజ్ ఎక్కువగా నిండిపోయినా పనితీరు తగ్గి వేడి పెరుగుతుంది. అందుకే అవసరం లేని ఫైల్స్, యాప్స్ తొలగించడం అవసరం. ఫోన్ కవర్ (కేస్) కూడా ఓవర్‌హీటింగ్‌కు కారణం కావచ్చు. ఎక్కువగా వేడి నిల్వ చేసుకునే మందమైన కవర్లు వాడితే, వేడి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. కాబట్టి తేలికైన, గాలి ఆడే కవర్లను ఉపయోగించడం మంచిది.
మరొక ముఖ్యమైన విషయం ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ చేయడం. కంపెనీలు విడుదల చేసే అప్‌డేట్స్‌లో పనితీరు మెరుగుదలలు, హీట్ మేనేజ్‌మెంట్ ఫిక్స్‌లు ఉంటాయి. అలాగే ఒరిజినల్ ఛార్జర్‌ను మాత్రమే ఉపయోగించడం కూడా కీలకం. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్ వేడెక్కే సమస్యను సులభంగా నియంత్రించవచ్చు. సరైన వినియోగం, నిర్వహణతో మీ స్మార్ట్‌ఫోన్ పనితీరు మెరుగ్గా ఉండటమే కాకుండా దీర్ఘకాలం పనిచేస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి