వారెవ్వా.. అద్భుత స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడితో నెలకు రూ.17 వేల ఆదాయం..

Post Office: రిటైర్మెంట్ తర్వాత కూడా ఎవరిపైనా ఆధారపడకుండా, ప్రతి నెలా చేతికి ఖచ్చితమైన ఆదాయం రావాలని కోరుకునే వారికి పోస్టాఫీస్ అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒక వరం లాంటిది. మీ కష్టార్జితానికి ప్రభుత్వ గ్యారెంటీ ఉండటమే కాకుండా బ్యాంక్ ఎఫ్‌డీల కంటే మెరుగైన వడ్డీని అందిస్తుంది ఈ పథకం.

వారెవ్వా.. అద్భుత స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడితో నెలకు రూ.17 వేల ఆదాయం..
Post Office Senior Citizen Savings Scheme

Updated on: Mar 19, 2026 | 1:29 PM

కష్టపడి సంపాదించిన సొమ్మును భద్రంగా ఉంచుకోవడంతో పాటు దానిపై స్థిరమైన రాబడిని ఆశించే భారతీయులకు పోస్ట్ ఆఫీస్ ఎప్పుడూ నమ్మకమైన వేదిక. ముఖ్యంగా వృద్ధాప్యంలో రెగ్యులర్ ఆదాయం కోసం చూస్తున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఎక్కువ వడ్డీని ఈ పథకం అందిస్తుంది. ప్రైవేట్ సంస్థలు లేదా మార్కెట్ రిస్క్ ఉన్న పథకాలతో పోలిస్తే, పోస్టాఫీస్ పథకాలకు ప్రభుత్వం నేరుగా హామీ ఇస్తుంది. కాబట్టి ఇందులో మీరు పెట్టే ప్రతి పైసా సురక్షితం. ప్రస్తుతం ఈ పథకం 8.2 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది, ఇది అనేక బ్యాంకుల వడ్డీ రేట్ల కంటే మెరుగైనది.

పెట్టుబడి పరిమితులు మరియు అర్హతలు

కేవలం రూ. 1,000 తో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉంది. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారు దీనికి అర్హులు. అయితే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న వారు 55 ఏళ్లు దాటితే, రక్షణ శాఖ నుండి రిటైర్ అయిన వారు 50 ఏళ్లు దాటితే ఈ పథకంలో చేరవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

మ్యాజిక్ లెక్క: నెలకు రూ. 17,000 ఆదాయం ఎలా?

ఈ పథకంలో అసలైన లాభం త్రైమాసిక వడ్డీ చెల్లింపుల్లో ఉంది. ఉదాహరణకు మీరు జాయింట్ అకౌంట్ ద్వారా రూ. 25 లక్షలు డిపాజిట్ చేశారనుకుందాం. 8.2 శాతం వడ్డీ రేటు ప్రకారం.. ప్రతి మూడు నెలలకు మీకు రూ.51,250 వడ్డీ లభిస్తుంది. దీనిని నెలవారీగా విభజిస్తే.. మీకు సుమారు రూ.17,000 స్థిర ఆదాయం లభిస్తుంది. ఇది ఒక గౌరవప్రదమైన పెన్షన్ లాగా మీ ఖర్చులకు ఉపయోగపడుతుంది.

ముఖ్యమైన నిబంధనలు

ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. అవసరమైతే మరో 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు. మీరు డిపాజిట్ చేసిన సమయంలో ఉన్న వడ్డీ రేటు, ఆ 5 ఏళ్ల పాటు స్థిరంగా ఉంటుంది. మధ్యలో వడ్డీ రేట్లు తగ్గినా మీకు నష్టం ఉండదు. 5 ఏళ్ల లోపు ఖాతా మూసివేస్తే నిబంధనల ప్రకారం జరిమానా ఉంటుంది. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే, మొత్తం సొమ్ము నామినీకి అందుతుంది.

Follow Us