ChatGPTతో ఫేక్ ఫ్లైట్ టికెట్.. గోవా ట్రిప్‌కు బదులు పోలీస్ స్టేషన్‌కు!

ChatGPT: ఈ ఘటనపై పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసి, అస్లంకు నోటీసులు జారీ చేశారు. AI సాయంతో రూపొందించిన నకిలీ టికెట్స్, ఇతర డాక్యుమెంట్స్ చట్టపరమైన సమస్యలకు దారి తీస్తాయని, ఇలాంటి చర్యలు సరదాగా చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని..

ChatGPTతో ఫేక్ ఫ్లైట్ టికెట్.. గోవా ట్రిప్‌కు బదులు పోలీస్ స్టేషన్‌కు!
Fake Flight Ticket

Edited By:

Updated on: Aug 04, 2026 | 12:05 PM

ChatGPT: సరదాగా చేసిన ఓ ప్రాంక్ ఇద్దరు స్నేహితులను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. గోవా వెళ్లాలని ఉత్సాహంగా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న యువకుడికి చెక్-ఇన్ కౌంటర్ వద్ద తన ఈ-టికెట్ నకిలీదని తెలిసి షాక్ తగిలింది. ఈ ఘటన హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సయ్యద్ అనే వ్యక్తి గోవా వెళ్లేందుకు తన స్నేహితుడు అస్లంను విమాన టికెట్ బుక్ చేయమని కోరాడు. టికెట్‌కు సంబంధించిన డబ్బును కూడా అతనికి పంపించాడు. అయితే అస్లం అసలు టికెట్ బుక్ చేయకుండా, సయ్యద్ వ్యక్తిగత వివరాలను ChatGPTలో ఇచ్చి విమాన టికెట్‌లా కనిపించే ఓ డాక్యుమెంట్ తయారు చేయించాడు. దానిని వాట్సాప్‌లో పంపిస్తూ టికెట్ కన్ఫర్మ్ అయిందని నమ్మించాడు.

ఆ టికెట్‌తో హైదరాబాద్ విమానాశ్రయంలోని ఇండిగో చెక్-ఇన్ కౌంటర్‌కు వెళ్లిన సయ్యద్‌కు అక్కడి సిబ్బంది అది అసలు టికెట్ కాదని, నకిలీ డాక్యుమెంట్ అని తెలిపారు. దీంతో అతడిని విమానంలో ప్రయాణించేందుకు అనుమతించలేదు. మొదట ట్రావెల్ ఏజెంట్ తమను మోసం చేశాడని సయ్యద్ భావించాడు. ఈ విషయంపై అస్లంను పలుమార్లు సంప్రదించినా స్పందించకపోవడంతో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అస్లంను స్టేషన్‌కు పిలిపించి విచారించగా, సరదాగా స్నేహితుడిని ఆట పట్టించాలనే ఉద్దేశంతో ఇలా చేశానని అంగీకరించాడు.

ఇది కూడా చదవండి: School Holidays: అక్కడ ఆగస్ట్‌ 4 నుంచి 12వ తేదీ వరకు విద్యాసంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..!

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసి, అస్లంకు నోటీసులు జారీ చేశారు. AI సాయంతో రూపొందించిన నకిలీ టికెట్స్, ఇతర డాక్యుమెంట్స్ చట్టపరమైన సమస్యలకు దారి తీస్తాయని, ఇలాంటి చర్యలు సరదాగా చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Meesho: మీషో విజయ రహస్యం.. ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు తక్కువ ధరలకే ఎందుకు లభిస్తాయి? సీక్రెట్‌ ఇదే!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us