AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. విద్యార్థుల అకౌంట్లోకి నేరుగా రూ.16 లక్షలు.. అప్లై చేసుకుంటే..

విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అందులో పీఎం విద్యాక్ష్మి పథకం ఒకటి. ఈ పథకం ద్వారా విద్యార్థులు తమ చదువుల కోసం రూ.16 లక్షల వరకు రుణం పొందవచ్చు. దీని కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ప్రాసెస్ ఏంటి అనే వివరాలు చూద్దాం.

Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. విద్యార్థుల అకౌంట్లోకి  నేరుగా రూ.16 లక్షలు.. అప్లై చేసుకుంటే..
students
Venkatrao Lella
|

Updated on: Mar 29, 2026 | 2:48 PM

Share

కొంతమందికి ఉన్నత చదువులు చదవాలని ఉన్నా కుటుంబ ఆర్ధిక పరిస్థితుల వల్ల వెనక్కి తగ్గుతారు. చదువుకోవడానికి డబ్బుల్లేక సతమతమవుతుంటారు. ఇలాంటివారికి ఆర్ధిక చేయూత అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా పైచదువులు చదుకుకోవాలనుకునే విద్యార్థులు ప్రభుత్వం ద్వారా రుణం పొందవచ్చు. ఇక వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అర్హతలు ఏంటి? అనే వివరాలు తెలుసుకుందాం.

2024లో ప్రారంభం

2024 బడ్జెట్‌లో విద్యాలక్ష్మి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇక 2024 నవంబర్ 6న కేబినెట్ ఈ స్కీమ్‌కు ఆమోదం తెలపగా.. ఆ తర్వాత నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా హాయ్యర్ చదువుల కోసం విద్యార్థులకు రూ.16 లక్షల వరకు రుణ సౌకర్యం అందిస్తారు. రూ.10 లక్షల లోన్‌కు కేవలం రూ.3 శాతం వడ్డీ ఉంటుంది. ఇది తిరిగి చెల్లించడానికి 15 ఏళ్ల టైమ్ ఉంటుంది. ఇక వడ్డీపై కేంద్రం సబ్సిడీ కూడా ఇస్తోంది. కోర్సు పూర్తయిన తర్వాత ఏడాది వరకు వడ్డీలో మినహాయింపు సౌకర్యం కల్పిస్తారు. ఉన్నత చదువుల కోసం ఆర్ధిక ఇబ్బందులతో బాధపడేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

అర్హతలు

-దేశంలోని విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు

-కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల వరకు ఉంటే వడ్డీలో రాయితీ

-టాప్ 860 క్వాలిటీ హయ్యర్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు సంపాదించి ఉండాలి

-డొనేషన్ ద్వారా మేనేజ్‌మెంట్ కోటాలో చేరితే రుణం అందించరు

-ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతుంటే అనర్హులు

-యూజీ, పీజీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులకు మాత్రమే రుణం అందుతుంది

దరఖాస్తు ఎలా చెసుకోవాలి..?

-https://pmvidyalaxmi.co.in/Index.aspx వెబ్ సైట్‌కు వెళ్లండి

-స్టూడెంట్ లాగిన్‌పై క్లిక్ చేసి క్రియేట్ న్యూ అకౌంట్ ఎంచుకోండి

-మీ పేరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీని ఇవ్వండి

-మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేయండి

-పాస్ వర్డ్ ఎంటర్ చేసి కన్పార్మ్ చేయండి

-క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి

-మీ వివరాలతో లాగిన్ అవ్వండి

-హోమ్ పేజీలో కనిపించే అప్లై ఫర్ ఎడ్యుకేషన్ లోన్ ఆప్షన్ ఎంచుకోండి

-వివరాలతో పాటు డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయండి

-ఏ బ్యాంక్ నుంచి లోన్ కావాలో ఎంచుకోండి

-అనంతరం సబ్మిట్ చేయండి

-అప్లికేషన్ నెంబర్ ఆధారంగా స్టేటస్ చెస్ చేసుకోవచ్చు.

అవసరమైన డాక్యుమెంట్స్

ఆధార్, పాన్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఇన్‌స్టిట్యూట్ అడ్మిట్ కార్డ్, ఫీజు వివరాలు. ఇన్ కమ్ సర్టిఫికట్

Follow Us