
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, స్టవ్, సిలిండర్ అందిస్తోంది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన స్కీమ్ ద్వారా వీటిని అందిస్తోంది. ప్రస్తుతం PMUY 2.0 పథకాన్ని అమలు చేస్తుండగా.. దీనిని మరికొన్నేళ్ల పాటు పొడిగించాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. మరింతమందికి ఉచిత గ్యాస్ కనెక్షన్, సిలిండర్లపై సబ్సిడీ అందించాలని కేంద్రం నిర్ణయించింది. కట్టెల పొయ్యిపై ఆధారపడే మహిళలకు వంట గ్యాస్ అందించడమే ఈ స్కీమ్ లక్ష్యం. ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్, స్టవ్, తొలి సిలిండర్ ఉచితంగా అందిస్తారు. ఆ తర్వాత సిలిండర్ రీఫిల్లింగ్‌పై రూ.300 సబ్సిడీ అందిస్తారు.
-మహిళ వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి
-బీపీఎల్ఓ కుటుంబానికి చెందినవారై ఉండాలి
-ఇప్పటివరకు కుటుంబంలో ఎవరి పేరుపై కూడా గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండకూడదు
-రేషన్ కార్డు ఉండాలి
-కుటుంబ ఆదాయ వివరాలు ప్రభుత్వ అర్హతలను బట్టి ఉండాలి
-దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు
-ఆధార్, రేషన్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, డిక్లరేషన్ ఫారం, అడ్రస్ ప్రూఫ్, కేవైసీ ఫారం
-https://www.pmuy.gov.in/ujjwala2.html వెబ్‌సైట్లోకి వెళ్లండి
-ఆన్‌లైన్ పోర్టల్ ఆప్షన్ ఎంచుకోండి
-Indane, Bharatgas లేదా HP Gasలలో మీకు నచ్చిన కంపెనీని ఎంచుకోండి
-అనంతరం ఆయిల్ కంపెనీకి సంబంధించి వెబ్ సైట్లో లాగిన్ అవ్వండి
-ఆ తర్వాత కొత్త కనెక్షన్ ఫారం నింపండి
-అవసరమైన పత్రాలు సమర్పించండి
-అనంతరం డిస్ట్రిబ్యూటర్లు మీ అప్లికేషన్‌ను పరిశీలించి ఆమోదిస్తారు
-ఆ తర్వాత మీ నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండానే గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయడంతో పటు స్టవ్, గ్యాస్ సిలిండర్ అందిస్తారు
ఈ పథకంలో ఉన్నవారికి తొలి సిలిండర్ ఉచితంగా అందిస్తారు. ఆ తర్వాత ఏడాదికి నాలుగు సిలిండర్ల బుకింగ్‌పై రూ.300 సబ్సిడీ అందిస్తారు. అంటే ఏదాడికి రూ.1200 సబ్సిడీ పొందవచ్చు. గతంలో ఏడాదికి ఆరు సిలిండర్లపై రూ.300 చొప్పున సబ్సిడీ అందించారు. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల క్రమంలో సబ్సిడీ సిలిండర్ల సంఖ్యపై కేంద్రం కోత విధించింది. నాలుగు సిలిండర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏడాది నాలుగు సిలిండర్లు ఒక కుటుంబానికి సరిపోతాయనే అభిప్రాయానికి వచ్చింది. దీంతో సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కనెక్షన్లు లేనివారు ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు.