AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Governemnt: కేవలం రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షలు అకౌంట్లోకి.. కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. మీరూ చేరవచ్చు..

కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా కవరేజ్ అందిస్తోంది. సామాన్యులకు బీమా కవరేజ్ అందించేందుకు ఎప్పటినుంచో ఈ స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకంలో ఇప్పటికే లక్షలాది మంది చేరారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇందులో పొందవచ్చు.

Central Governemnt: కేవలం రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షలు అకౌంట్లోకి.. కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. మీరూ చేరవచ్చు..
Money
Venkatrao Lella
|

Updated on: Sep 27, 2026 | 6:44 PM

Share

కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. సేవింగ్స్ స్కీములతో పాటు బీమా పథకాలను కూడా అమలు చేస్తోంది. తక్కువ ప్రీమియంతో పాటు పెద్ద మొత్తంలో బీమా అందించే పథకం ఒకటి ఉంది. అదే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబానికి బీమా సొమ్ము లభిస్తుంది. ఈ పథకంలో చేరేందుకు ఎలాంటి మెడికల్ టెస్టులు కూడా అవసరం లేదు. జస్ట్ ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లిస్తే చాలు.. ఏకంగా రూ.2 లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది. ఇంత తక్కువ ప్రీమియం ఉన్న బీమా పథకం దేశంలో ఎక్కడా లభించదు. దీంతో ఇది బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. సామాన్య ప్రజలకు బీమా సౌకర్యం కల్పించేందుకు కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది.

అర్హతలు ఇవే

18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఎవరైనా ఇందులో చేరవచ్చు. బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నప్పటికీ.. ఒక్క అకౌంట్ ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరడానికి వీలవుతుంది. జాయింట్ అకౌంట్ ఉంటే ఇద్దరూ రూ.20 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఆటో డెబిట్ ప్రక్రియ ద్వారా కట్ అవుతుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు బీమా కవరేజ్ వర్తిస్తుంది. రూ.20 కడితేనే రెన్యూవల్ అవుతుంది. లేకపోతే స్కీమ్ నుంచి తొలగిస్తారు. ఏడాది మధ్యలో అయినా ప్రీమియం చెల్లించి ఈ స్కీములో చేరవచ్చు. అనుకోని పరిస్థితుల్లో ఈ స్కీములో చేరిన వ్యక్తి మరణించినప్పుడు కుటుంబసభ్యులు లేదా నామినీకి రూ.2 లక్షలు అందుతాయి.

బీమా కవరేజీ వీరికే..

రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, అంగవైకల్యానికి ఈ బీమా కవరేజీ దక్కుతుంది. హత్య జరిగినప్పుడు కూడా క్లెయిమ్ అందుతుంది. ఆత్మహత్యలకు ఇవి వర్తించదు. అంగవైక్యలం చెందితే బాధితుడికి రూ.2 లక్షల బీమా సొమ్ము అందుతుంది. రోడ్డు, రైలు, నీటిలో మునిగిపోవడం వంటి మరణాలకు క్లెయిమ్ పొందేందుకు పోలీస్ ఎఫ్ఐఆర్ అనేది తప్పనిసరి. పాము కాటు, చెట్టుపైనుంచి పడటం వంటి ప్రమాదాలకు మెడికల్ టెస్టుల ఆధారంగా క్లెయిమ్ చెల్లిస్తారు. ఈ పథకంలో చేరేటప్పుడు నియమ, నిబంధనల గురించి తెలుసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో కుటుంబసభ్యులకు క్లెయిమ్ వస్తుందనేది తెలుసుకుని చేరండి. ఈ పథకంలో చేరేందుకు పెద్దగా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉండదు. ఏదైనా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ బీమా పథకంలో చేరారు.

Follow Us