PM Modi: ఆరు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

|

Sep 15, 2024 | 12:26 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జార్ఖండ్‌లో పర్యటిస్తున్నారు. జార్ఖండ్‌కు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. జంషెడ్‌పూర్‌లో మోడీ ఆరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా, కర్మ పూజపై జార్ఖండ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్‌..

PM Modi: ఆరు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
Follow us on

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జార్ఖండ్‌లో పర్యటిస్తున్నారు. జార్ఖండ్‌కు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. జంషెడ్‌పూర్‌లో మోడీ ఆరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా, కర్మ పూజపై జార్ఖండ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్‌ కోసం కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. జార్ఖండ్‌లో ఆధునిక సౌకర్యాలు లభిస్తున్నాయని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

ఇంతకుముందు అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, ఇప్పుడు దేశంలోని పేదలు, గిరిజనులకే ప్రాధాన్యత ఉందని ప్రధాని మోదీ అన్నారు. దళితులు, అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. నేడు పేదలు నేరుగా పథకాల ప్రయోజనాలను పొందుతున్నారని మోదీ అన్నారు. రైలు కనెక్టివిటీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

 


జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలో మధుపూర్ బైపాస్ లైన్, హజారీబాగ్‌లోని హజారీబాగ్ టౌన్ కోచింగ్ డిపోకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు జార్ఖండ్‌లోని టాటానగర్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామిన్ (పీఎంఏవై-జీ) లబ్ధిదారులకు అంగీకార పత్రాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు తొలి విడత సహాయాన్ని కూడా ఆయన విడుదల చేశారు.

ఇదిలా ఉండగా, ప్రధాని రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఒక సోదరి కర్మ పండుగకు గుర్తుగా నాకు స్వాగతం పలికింది అని మోడీ అన్నారు. ఈ పండుగలో సోదరీమణులు తమ సోదరుడి క్షేమం కోసం ప్రార్థించారని అన్నారు.

 


జంషెడ్‌పూర్‌లో జరిగే ప్రధాని రోడ్‌ షోను రద్దు అయ్యింది. ఎందుకంటే భారీ వర్షం కారణంగా రద్దు చేశారు. బిస్తూపూర్ నుంచి గోపాల్ మైదాన్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో జరగనుంది. జార్ఖండ్‌ మాజీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్‌ మరాండీ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. జంషెడ్‌పూర్‌లో నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రధాని మోదీ కార్యక్రమాల్లో భాగంగా ఉన్న రోడ్‌షో కార్యక్రమాన్ని ప్రస్తుతానికి రద్దు చేసినట్లు తెలిపారు. ఇది కాకుండా, టాటానగర్‌లో రూ. 660 కోట్లకు పైగా ఖర్చు చేసే వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి