Petrol: పెట్రోల్, డీజిల్ బంకుల్లో ‘సున్నా’ను చూసి మోసపోకండి.. అసలు మోసం ఇక్కడే ఉంది.. ఇది ఎవరూ గమనించరు..
పెట్రోల్ బంక్ నిర్వాహకులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక ట్రిక్స్ పాటిస్తూ ఉంటారు. కస్టమర్లు గుర్తించకుండా అనేక మోసాలకు పాల్పడుతూ ఉంటారు. దీంతో మీరు పెట్రోల్ లేదా డీజిల్ నింపుకోవడానికి వెళ్లినప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా తనిఖీలు చేయాలి.

పెట్రోల్ బంక్‌లకు పెట్రోల్ లేదా డీజిల్ నింపుకోవడానికి వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది జీరోను చెక్ చేసుకోండి అని చెబుతుంటారు. మెషీన్ స్క్రీన్‌పై జీరో అంకెలను చూసి ఇంధనం కరెక్ట్‌గా నింపుతున్నారని అందరూ అనుకుంటారు. అయితే కేవలం జీరోను మాత్రమే చూసుకుని నింపుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. జీరో అంకెలను చూపించి చాలా తెలివిగా మిమ్నల్ని మోసం చేయవచ్చు. మీ కళ్లు జీరో అంకెలపై దృష్టి సారిస్తే వేరే అత్యాధునిక పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మీరు అశ్రద్దగా ఉంటే మీ డబ్బులు వృధా అవ్వడంతో పాటు స్వచ్చత లేని ఇంధనం వల్ల మీ వాహనం మైలేజ్ తగ్గుతుంది. అంతేకాకుండా మీ వెహికల్ ఇంజిన్ కూడా దెబ్బతినవచ్చు. అసలు మోసం ఎక్కుడ జరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ మూడో స్క్రీన్ చూడండి..
పెట్రోల్ బంకుల్లోని మెషీన్లలో మూడు వేర్వేరు డిజిటల్ డిస్‌ప్లే విభాగాలు ఉంటాయి. తొలి స్క్రీన్‌లో మొత్తం పరిమాణం కనిపిస్తే.. రెండో స్క్రీన్‌లో పరిమాణం ప్రదర్శిస్తుంది. మూడో స్క్రీన్‌లో ఇంధన సాంద్రత కనిపిస్తుంది. ఈ మూడో స్క్రీన్‌పై కూడా మీరు ఎక్కువ దృష్టి పెట్టాలి. మీరు నింపుకునే ఇంధనం స్వచ్చమైనదా.. కాదా అనేది ఇది నిర్ధారిస్తుంది. కొంతమంది వచ్చి పెట్రోల్ నింపుకున్నాక డబ్బులు చెల్లించి వెళ్లిపోతారు. కానీ సాంద్రతను తనిఖీ చేయరు. కల్తీ పెట్రోల్ లేదా నాణ్యత లేని పెట్రోల్ ఉంటే ఈ రీడింగ్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. కొంతమంది పంప్ నిర్వాహకులు తమ లాభాలను పెంచుకునేందుకు డెన్సిటీని తారుమారు చేస్తుంటారు. దీంతో మీరు పెట్రోల్ లేదా డీజిల్ నింపుకునే సమయంలో సాంద్రత రీడింగ్‌ను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. వినియోగదారులు తాము నింపుకునేది స్వచ్చమైన ఇంధనమా.. కాదా అనేది తెలుసుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
డెన్సిటీ పరిమితులు ఇవే..
ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. పంప్ నిర్వహకులు తమకు నచ్చిన సాంద్రత గల ఇంధనాన్ని వాహనదారులకు నింపడానికి వీల్లేదు. ప్రభుతవం నిర్దేశించిన పరిమితులను పాటించాలి. ఒకవేళ ఆ పరిమితి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉన్నా అది కల్తీ జరిగిందని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్రోల్ డెన్సిటీ ఒక ఘనపు మీటర్‌కు 720 నుంచి 775 కిలోగ్రాముల మధ్య ఉండాలి. ఇక డీజిల్ డెన్సిటీ ఒక ఘనపు మీటర్‌కు 820 నుంచి 860 కిలోగ్రాముల మధ్య ఉండాలి. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ డెన్సిటీ అనేది మారదు. పెట్రోల్ బంక్ నిర్వాహకులు ప్రతీ ఉదయం తమ వద్ద ఉన్న నూనె నిల్వ సాంద్రతను తనిఖీ చేస్తారు.
