Petrol Diesel Price: బాదుడే.. బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రధాన నగరాల్లో..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మంటలు చెలరేగుతున్నాయి. అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కనపిస్తోంది. ఇక..

Petrol Diesel Price: బాదుడే.. బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రధాన నగరాల్లో..
Petrol Diesel Prices

Updated on: Oct 07, 2021 | 8:38 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మంటలు చెలరేగుతున్నాయి. అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కనపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి. పెట్రోల్‌పై 32 పైసలు, డీజీలు 38 పైసలు పెరిగింది. గురువారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చాలా నగరాల్లో పెట్రో పరుగు కొనసాగుతోంది. ఇదిలాఉంటే.. తెలంగాణలోని వరంగల్ మినహా అన్ని కేంద్రాల్లో డీజిల్ ధర సెంచరీ దాటింది. హైదరాబాద్ కంటే మేందే కరీంనగర్‌లో రూ.100.06కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.40గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 100.13గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.27గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.100.01గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 107.48గా ఉండగా.. డీజిల్ ధర రూ. 100.19గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.50గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.23గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.41 ఉండగా.. డీజిల్ ధర రూ.100.14గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.91 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.67గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.60 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.74 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.99 ఉండగా.. డీజిల్ ధర రూ. 100.50గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.29 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.101.08గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.08గా ఉండగా.. డీజిల్ ధర రూ.101.29గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 109.60 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.101.74లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 103.24 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.77 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.25కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.55గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.103.94 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 94.88 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 100.86 ఉండగా.. డీజిల్ ధర రూ.96.37గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.106.83 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.97.40గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.22 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.92.13గా ఉంది.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఇలాంటి వ్యక్తులతో అస్సలు స్నేహం చేయవద్దు.. చేస్తే ఇక అంతే..

Railway Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ కేంద్రంగా రైల్వే ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us