HDFC: షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. లక్ష రుణం తీసుకుంటే నెలకు EMI ఎంత కట్టాలి?

HDFC: ఇది రుణగ్రహీతలకు షాకిచ్చే వార్త అయినప్పటికీ, బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) ఉన్నవారికి మాత్రం శుభవార్త. ఎందుకంటే భవిష్యత్తులో FD వడ్డీ రేట్లు మెరుగుపడవచ్చు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ ప్రజలకు 2.75% నుండి 6.50% వరకు, సీనియర్ సిటిజన్లకు..

HDFC: షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. లక్ష రుణం తీసుకుంటే నెలకు EMI ఎంత కట్టాలి?
Hdfc Bank

Updated on: Jun 10, 2026 | 1:10 PM

HDFC: మీకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో గృహ రుణం, వ్యక్తిగత రుణం లేదా కారు రుణం ఉన్నట్లయితే మీ జేబుపై మరింత భారం పడబోతోంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి తన ఎంసిఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్)ను పెంచింది. ఈ నిర్ణయం వల్ల కొత్త రుణం తీసుకోవడం ఖరీదైనదిగా మారడమే కాకుండా, రీసెట్ పీరియడ్ సమీపిస్తున్న కొద్దీ ఇప్పటికే రుణాలు ఉన్నవారి ఈఎంఐలు కూడా పెరుగుతాయి.

ఆసక్తికరంగా ఆర్‌బిఐ ఇటీవల జరిగిన సమావేశంలో రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా ఉంచిన తర్వాత బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఈఎంఐ భారం ఎంత పెరుగుతుందో లెక్క వేద్దాం.

ఇది కూడా చదవండి: Ather EV: ఏథర్ స్కూటర్లలో సరికొత్త మ్యాజిక్. ఇకపై మీ స్కూటర్ మీతో మాట్లాడుతుంది.. ఫోన్ చూడకుండానే రూట్ మ్యాప్!

ఇవి కూడా చదవండి

ఎంత మార్పు వచ్చింది?

HDFC బ్యాంక్ వివిధ రుణ కాలపరిమితుల కోసం తన MCLRను 5 నుండి 10 బేసిస్ పాయింట్ల (bps) మేర పెంచింది. 100 బేసిస్ పాయింట్లు అంటే 1%. ఈ మార్పుతో బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు ఇప్పుడు 8.05% నుండి 8.65%కి పెరిగాయి.

ఇప్పుడు కొత్త రేట్లు ఏమిటి?

  • రాత్రికి రాత్రే (ఒక రోజు రుణం): 8.05% నుండి 8.10%కి పెరిగింది.
  • 3 నెలల రుణం: 8.15% నుండి ఇప్పుడు 8.20%కి పెరిగింది.
  • 6 నెలల రుణం: 8.30% నుండి ఇప్పుడు 8.35%కి పెరిగింది.
  • 1 సంవత్సరం రుణం: 8.35% నుండి ఇప్పుడు 8.40%కి పెరిగింది.
  • 2 సంవత్సరాల రుణం: 8.45% నుండి 8.55%కి నేరుగా పెంచింది.
  • 3 సంవత్సరాల రుణం: 8.60% నుండి 8.65%కి పెరిగింది.

బ్యాంకు రెండేళ్ల రుణాలపై 10 బేసిస్ పాయింట్లను పెంచింది. అంతేకాకుండా, బ్యాంకు ఒక నెల MCLRలో ఎటువంటి మార్పులు చేయలేదు. అది 8.05% వద్ద యథాతథంగా ఉంది.

నెలవారీ EMI ఎంత పెరుగుతుంది?

మీరు 2 సంవత్సరాల కాలానికి రూ.1 లక్ష రుణం తీసుకున్నారని అనుకుందాం. మీరు రుణం తీసుకున్నప్పుడు వడ్డీ రేటు 8.45%గా ఉండేది. మీ నెలవారీ EMI రూ.4,543గా ఉండేది. అయితే, ఇప్పుడు బ్యాంకు తన వడ్డీ రేట్లను పెంచింది. అందుకే 2 సంవత్సరాల రుణానికి కొత్త వడ్డీ రేటు 8.55%గా ఉంటుంది. మీ నెలవారీ EMI రూ.4,548 అవుతుంది.

అది మిమ్మల్ని ఎప్పుడు, ఎలా ప్రభావితం చేస్తుంది?

MCLR పెరుగుదల కారణంగా మీ EMI పెరుగుతుందా లేదా అనేది మీ లోన్ ఏ రేటుకు అనుసంధానించి ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. మీ లోన్ MCLR-అనుసంధానితమైతే, వడ్డీ రేటు తప్పనిసరిగా పెరుగుతుంది. అయితే, ఈ షాక్‌ను మీరు వెంటనే అనుభూతి చెందరు. ప్రతి లోన్‌కు ఒక ‘రీసెట్ పీరియడ్’ (ఉదాహరణకు 6 నెలలు లేదా 1 సంవత్సరం) ఉంటుంది. మీ లోన్ ఆ కాలం ముగియగానే మీ కొత్త EMI ప్రారంభమవుతుంది.

MCLR అంటే ఏమిటి?

MCLR అనేది ఒక కనీస వడ్డీ రేటు. దీని కంటే తక్కువకు బ్యాంకు తన వినియోగదారులకు రుణం ఇవ్వదు. ఆర్‌బిఐ 2016లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకులు తమ ఖర్చులు, నిధుల వ్యయం ఆధారంగా ఈ రేటును నిర్ణయిస్తాయి.

ఎఫ్‌డీ ఉన్నవారికి సిల్వర్:

ఇది రుణగ్రహీతలకు షాకిచ్చే వార్త అయినప్పటికీ, బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) ఉన్నవారికి మాత్రం శుభవార్త. ఎందుకంటే భవిష్యత్తులో FD వడ్డీ రేట్లు మెరుగుపడవచ్చు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ ప్రజలకు 2.75% నుండి 6.50% వరకు, సీనియర్ సిటిజన్లకు 3.25% నుండి 7% వరకు వార్షిక వడ్డీ రేట్లను అందిస్తోంది. తత్ఫలితంగా వడ్డీ రేట్లలో ఈ పెరుగుదల ఎఫ్‌డీ రాబడులను స్వల్పంగా పెంచవచ్చు.

ఇది కూడా చదవండి: ATM Shutdown: దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!

ఇది కూడా చదవండి: Gold Price Fall: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం.. వెండిపై రూ.10 వేలు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us