Gold Selling: అలర్ట్.. అలర్ట్.. ఇది లేకుండా బంగారు ఆభరణాలు కొన్నారో అంతే సంగతులు.. చాలా నష్టపోతారు.. వివరాలు తెలుసుకోండి..

|

May 22, 2023 | 5:00 PM

ఈ ఏడాది 2023 ఏప్రిల్ 1 నుంచి అన్ని బంగారు ఆభరణాలు తప్పనిసరిగా హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యుఐడీ) నంబర్‌ను కలిగి ఉండాలని ఆదేశించింది. మీరు ఆభరణాలు కలిగి ఉంటే ఈ నంబర్ ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి.

Gold Selling: అలర్ట్.. అలర్ట్.. ఇది లేకుండా బంగారు ఆభరణాలు కొన్నారో అంతే సంగతులు.. చాలా నష్టపోతారు.. వివరాలు తెలుసుకోండి..
Gold
Follow us on

బంగారం.. ప్రతి మగువకు అదో అలంకారం. ఇంట్లో ఏ శుభకార్యమైనా మొదట గుర్తొచ్చేది బంగారమే. మన భారతీయ సంప్రదాయంలో బంగారు ఆభరణాలకు అంతటి ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈసమయంలో అధికంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. అయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. అదేంటంటే మన భారత ప్రభుత్వం బంగారు ఆభరణాల విక్రయాలపై ఇటీవల కొత్త నిబంధనలను రూపొందించింది. బంగారు వస్తువుల అమ్మకానికి మరింత పారదర్శకతను తీసుకురావడానికి, వినియోగదారులు ఎక్కడా మోసపోకుండా ఉండేందుకు ఈ నియమాలు తీసుకొచ్చింది. ఈ ఏడాది 2023 ఏప్రిల్ 1 నుంచి అన్ని బంగారు ఆభరణాలు తప్పనిసరిగా హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యుఐడీ) నంబర్‌ను కలిగి ఉండాలని ఆదేశించింది. మీరు  ఆభరణాలు కలిగి ఉంటే ఈ నంబర్ ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ మీరు పాత హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలను కలిగి ఉంటే.. దానిని మార్పిడి లేదా విక్రయించాలనుకుంటే, మీరు తప్పనిసరిగా హాల్‌మార్క్ పొందాలి.

హెచ్‌యుఐడీ అంటే ఏమిటంటే..

బంగారు ఆభరణాలపై ఉండే హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య.. అది తయారైన విధానాన్ని సూచిస్తుంది. ఇది బంగారు స్వచ్ఛతను, నాణ్యతను తెలియజేస్తుంది. ఉదాహరణకు, 22-క్యారెట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లోగో.

హాల్ మార్క్ లేకపోతే..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలను విక్రయించరాదు. మీ వద్ద ఉన్న పాత హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలు మార్పిడి లేదా విక్రయించాలనుకుంటే మీరు వాటిని హెచ్‌యుఐడీతో హాల్‌మార్క్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

వీటికి మినహాయింపు..

రెండు గ్రాముల లోపు బంగారం, అంతర్జాతీయ ప్రదర్శనల కోసం ఉద్దేశించిన ఆభరణాలు, విదేశీ కొనుగోలుదారు నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ఏదైనా వస్తువు, ఫౌంటెన్ పెన్నులు, గడియారాలు లేదా ప్రత్యేక రకాల ఆభరణాలకు హాల్‌మార్కింగ్ అవసరం లేదు. అలాగే రూ. 40 లక్షల లోపు వార్షిక టర్నోవర్ ఉన్న నగల వ్యాపారులకు కూడా ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఉంది.

ఇలా హాల్ మార్క్ చేయించండి..

వినియోగదారులు ఏదైనా బీఐఎస్ గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ కేంద్రం నుంచి ఆభరణాలను పరీక్షించుకోవచ్చు. పరీక్షించాల్సిన ఐటెమ్‌ల సంఖ్య ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, వ్యక్తి ఒక్కో దానికి రూ. 45 చెల్లించాలి. ఒకవేళ సరుకులో నాలుగు ఆర్టికల్స్ ఉంటే, ఛార్జీ రూ. 200 అవుతుంది. అలాగే బీఐఎస్ లో రిజిస్టరైన నగల వ్యాపారి ద్వారా కూడా ఆభరణాలను హాల్‌మార్క్ చేసుకోవచ్చు. ప్రక్రియ కోసం ఆభరణాల వ్యాపారి వస్తువును బీఐఎస్ అస్సేయింగ్ , హాల్‌మార్కింగ్ సెంటర్‌కు తీసుకువెళతారు.

నాణ్యతకు చిహ్నం..

కొత్త హాల్‌మార్కింగ్ నియమాలు బంగారాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేలా చేస్తుంది. అలాగే ఉత్పత్తుల నాణ్యతను తట్టి చూపుతుంది. బంగారు హాల్‌మార్క్ లేకుండా నగలు విక్రయించే వ్యాపారులకు ఒక సంవత్సరం జైలు శిక్ష, లేదా బంగారు ఆభరణాల ధర కంటే ఐదు రెట్లు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..