New House Foundation Cost: కొత్త ఇల్లు నిర్మాణంలో పునాదికి ఎంత ఖర్చు అవుతుంది? సిమెంట్, ఇసుక, ఐరన్, ఇటుకలు, మేస్త్రీ ఖర్చు!

New House Foundation Cost: నిర్మాణ ఖర్చులు ప్రాంతాన్ని బట్టి, మెటీరియల్ ధరలలో మార్పులను బట్టి, మట్టి పరిస్థితిని బట్టి, ఇంజనీర్ సూచించే ఫౌండేషన్ డిజైన్‌ను బట్టి మారవచ్చు. ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు స్థానిక ధరలను, నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది..

New House Foundation Cost: కొత్త ఇల్లు నిర్మాణంలో పునాదికి ఎంత ఖర్చు అవుతుంది? సిమెంట్, ఇసుక, ఐరన్, ఇటుకలు, మేస్త్రీ ఖర్చు!
New House Foundation Cost

Updated on: Sep 19, 2026 | 5:16 PM

New House Foundation Cost: ఒక కొత్త ఇంటి నిర్మాణంలో పునాది (బేస్మెంట్) వేయడం అత్యంత కీలకమైన, ప్రాథమిక దశ. ఇంటి పటిష్టతకు, దీర్ఘకాల మన్నికకు పునాది నిర్మాణం ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. ఈ ప్రక్రియకు ఎంత సమయం పడుతుంది. ఎంత మంది వర్కర్లు అవసరమవుతారు? ముఖ్యంగా దీనికి అయ్యే ఖర్చు ఎంత అనే విషయాలను వివరంగా తెలుసుకోవడం ఇంటి యజమానులకు అవసరం. ఈ వివరాలు 133 గజాలు (సుమారు 1200 చదరపు అడుగులు) విస్తీర్ణంలో నిర్మించే ఇంటి బేస్మెంట్ నిర్మాణానికి అయ్యే అంచనా ఖర్చులను వివరిస్తుంది.

ఇది కూడా చదవండి: House Construction: 150 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? 3 రకాల బడ్జెట్లు మీ కోసం!

సాధారణంగా ఒక బేస్మెంట్ నిర్మాణం పూర్తవడానికి సుమారు ఆరు రోజులు పడుతుంది. ఈ పనిని ఎనిమిది మంది సభ్యుల బృందం నిరంతరంగా పనిచేస్తూ పూర్తి చేయగలదు. ఇందులో రాడ్ బెండర్లు, మేస్త్రీలు, హెల్పర్లు ఉంటారు. మొదటి రోజు నుండి బేస్మెంట్ పని పూర్తయ్యే వరకు ఏ పని జరిగింది, ఏ మెటీరియల్ ఎంత వాడారు, ఎంత పని పూర్తయింది వంటి వివరాలను పర్యవేక్షించడం ఖర్చుల నిర్వహణకు కీలకం.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Business Ideas: మీ గ్రామంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల సాయం..!

బేస్మెంట్ నిర్మాణానికి అవసరమయ్యే మెటీరియల్స్, వాటి ఖర్చులు:

1. ఇసుక: పునాది నిర్మాణంలో ఇసుక కీలక పాత్ర పోషిస్తుంది. 1200 చదరపు అడుగుల ఇంటి బేస్మెంట్ కోసం సుమారు 6 యూనిట్ల ఇసుక అవసరమవుతుంది. దీనికి అంచనా వ్యయం రూ.12,000.

2. సిమెంట్: కాంక్రీట్ మిశ్రమానికి సిమెంట్ ప్రధాన బైండింగ్ ఏజెంట్. బేస్మెంట్ నిర్మాణానికి దాదాపు 100 బస్తాల సిమెంట్ అవసరం కావచ్చు. ఒక బస్తా సిమెంట్ ధర సగటున రూ.300 అనుకుంటే, సిమెంట్ కోసం రూ.30,000 ఖర్చు అవుతుంది.

3. స్టీల్/ఐరన్: ఇంటి పునాదికి పటిష్టతను చేకూర్చడానికి స్టీల్ లేదా ఐరన్ బార్లు అత్యవసరం. సుమారు 1.5 టన్నుల స్టీల్ అవసరమవుతుంది, దీనికి అంచనా ఖర్చు రూ.90,000.

4. ఇటుకలు: పునాది గోడల నిర్మాణానికి ఇటుకలు ఉపయోగిస్తారు. బేస్మెంట్, చుట్టూ కాంపౌండ్ వాల్ కోసం సుమారు 8,000 ఇటుకలు అవసరం కావచ్చు. ఒక ఇటుక ధర రూ.7 అనుకుంటే, ఇటుకల కోసం రూ.56,000 వ్యయం అవుతుంది.

5. కంకర: కాంక్రీట్ మిశ్రమంలో కంకరను కూడా వాడతారు. బేస్మెంట్ కోసం సుమారు 3 యూనిట్ల కంకర అవసరమవుతుంది. దీనికి రూ.18,000 ఖర్చు కావచ్చు.

మేస్త్రీలు, కూలీల ఖర్చులు:

రాడ్ బెండర్లు, మేస్త్రీలు, కూలీలతో సహా మొత్తం కార్మికుల వేతనాలు బేస్మెంట్ నిర్మాణ ఖర్చులో గణనీయమైన భాగాన్ని ఆక్రమిస్తాయి. ఈ 1200 చదరపు అడుగుల ప్రాజెక్టుకు కార్మికుల ఖర్చులు సుమారు రూ.1,00,000 వరకు అంచనా వేస్తున్నారు బిల్డర్స్‌. ఈ ఖర్చులు ప్రాంతాన్ని బట్టి, కార్మికుల లభ్యతను బట్టి మారవచ్చు.

మొత్తం అంచనా ఖర్చు:

పైన పేర్కొన్న అన్ని ఖర్చులను కలిపితే, 1200 చదరపు అడుగుల ఇంటి బేస్మెంట్ నిర్మాణానికి మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.3,06,000 అవుతుంది. దీనికి అదనంగా, కార్మికుల భోజనం, టిఫిన్లు వంటి చిన్నపాటి ఖర్చులు రూ.10,000 నుంచి రూ.20,000 వరకు అదనంగా పడవచ్చు. కనుక మొత్తం బేస్మెంట్ నిర్మాణ ఖర్చు సుమారు రూ.3,10,000 నుంచి రూ.3,20,000 వరకు ఉండవచ్చు.

ముఖ్య గమనిక:

ఈ అంచనా ఖర్చులు సూచనప్రాయమైనవి మాత్రమే. నిర్మాణ ఖర్చులు ప్రాంతాన్ని బట్టి, మెటీరియల్ ధరలలో మార్పులను బట్టి, మట్టి పరిస్థితిని బట్టి, ఇంజనీర్ సూచించే ఫౌండేషన్ డిజైన్‌ను బట్టి మారవచ్చు. ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు స్థానిక ధరలను, నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us