
Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో సరైన సమయంలో సరైన స్టాక్‌ను గుర్తిస్తే అది సంపదను ఎలా పెంచుతుందో చెప్పడానికి ఈ కంపెనీయే నిదర్శనం. స్మాల్ క్యాప్ కేటగిరీలోని పేపర్ ప్రొడక్ట్స్ రంగానికి చెందిన గౌతమ్ ఎగ్జిమ్ లిమిటెడ్ (Gautam Exim Limited) తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకేసారి స్టాక్ స్ప్లిట్, బోనస్ షేర్లను ప్రకటించి ఇన్వెస్టర్లను ఖుషీ చేసింది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఏప్రిల్ 30న జరిగిన బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో 1:2 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు ఆమోదం లభించింది.
ఇది కూడా చదవండి: Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్‌టైమ్ హై కంటే తక్కువే!
కంపెనీ బోర్డు డైరెక్టర్ల నిర్ణయం ప్రకారం.. రెండు రకాల ప్రయోజనాలు ఇన్వెస్టర్లకు అందనున్నాయి.
స్టాక్ స్ప్లిట్ (1:2): రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక షేరు, రూ. 5 ఫేస్ వ్యాల్యూ గల రెండు షేర్లుగా మారుతుంది. అంటే మీ వద్ద ఉన్న 100 షేర్లు 200 అవుతాయి.
బోనస్ షేర్లు (3:1): స్ప్లిట్ తర్వాత మీ వద్ద ఉన్న ప్రతి 1 షేరుకు అదనంగా 3 షేర్లు బోనస్‌గా లభిస్తాయి. అంటే పైన చెప్పుకున్న 200 షేర్లకు అదనంగా 600 షేర్లు వస్తాయి.
మొత్తంగా: మీ వద్ద ఉన్న 100 షేర్లు కాస్తా 800 షేర్లుగా మారుతాయి. దీనికి సంబంధించిన రికార్డు తేదీని కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.
ఈ స్టాక్ గత ఐదేళ్లలో ఇన్వెస్టర్ల అదృష్టాన్ని మార్చేసింది.
5 ఏళ్లలో రిటర్న్స్: ఏకంగా 1296% లాభాన్ని అందించింది. అంటే ఐదేళ్ల క్రితం ఎవరైనా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువ ఇప్పుడు దాదాపు రూ. 14 లక్షలకు పైమాటే. గత ఏడాది కాలంలోనే ఈ షేరు 179% వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని చూస్తే.. గౌతమ్ ఎగ్జిమ్ షేరు ప్రస్తుతం రూ. 310 – రూ. 324 మధ్య ట్రేడవుతోంది. దీని 52 వారాల గరిష్ట ధర రూ. 369.50 కాగా, కనిష్ట ధర రూ. 111.75. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ. 100 కోట్ల వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: LPG Cylinder Prices: గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?
ఇది కూడా చదవండి: Post Office: రూ. 2.25 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 98,016 వడ్డీ.. అదిరిపోయే ప్రభుత్వ పథకం..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి