School Students : 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఖాతాలో డబ్బులు..! కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.. 1200 కోట్ల రూపాయల కేటాయింపు..

| Edited By: Phani CH

May 29, 2021 | 10:15 AM

Money in School Students Account : మధ్యాహ్నం భోజన పథకం (మిడ్ డే భోజనం) కింద విద్యార్థులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ

School Students : 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఖాతాలో డబ్బులు..!  కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.. 1200 కోట్ల రూపాయల కేటాయింపు..
Students 1
Follow us on

Money in School Students Account : మధ్యాహ్నం భోజన పథకం (మిడ్ డే భోజనం) కింద విద్యార్థులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) ద్వారా డబ్బును అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక సహాయక చర్యగా 11 కోట్ల 80 లక్షల మంది విద్యార్థులకు ఈ సహాయం అందించే ప్రతిపాదనను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఆమోదించారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే ప్రభుత్వ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీని కోసం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా వెయ్యి రెండు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ నిర్ణయం కోవిడ్ మహమ్మారి సమయంలో పిల్లలకు అవసరమైన పోషకాహారాన్ని అందించడానికి వారి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ప్రధాన్ మంత్రి గరిబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీకి అదనంగా ఈ సహాయం ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పేద సంక్షేమ పథకం కింద 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తోంది. ఈ నిర్ణయం మధ్యాహ్నం భోజన కార్యక్రమానికి చేదోడుగా ఉంటుంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం తరపున ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ అన్నా యోజన (పిఎం-జికె) కింద సుమారు 80 కోట్ల మంది లబ్ధిదారులకు నెలకు 5 కిలోల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్నారు.

మధ్యాహ్నం భోజన పథకం కింద నగదు బదిలీ చేయాలనే ఈ నిర్ణయం పిల్లల పోషక స్థాయిని పొందడంలో సహాయపడుతుంది. ఈ కరోనా అంటువ్యాధి సమయాల్లో వారి రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం అదనంగా సుమారు 1200 కోట్ల రూపాయలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఈ వన్ టైమ్ స్పెషల్ వెల్ఫేర్ వల్ల దేశవ్యాప్తంగా 11.20 లక్షల ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో మొదటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న 11.8 కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

మిడ్-డే భోజన పథకం 15 ఆగస్టు 1995 న ప్రారంభించబడింది. ఇది ‘నేషనల్ ఎడ్యుకేషన్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్’ (ఎన్‌పి-ఎన్‌ఎస్‌పిఇ) కింద ప్రారంభించబడింది. 2017 సంవత్సరంలో ఈ ఎన్‌పి-ఎన్‌ఎస్‌పిఈ పేరును ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మిడ్-డే మీల్ ఇన్ స్కూల్’ గా మార్చారు. నేడు ఈ పేరును మిడ్-డే భోజన పథకం అని పిలుస్తున్నారు. ఇటీవల, మధ్యాహ్నం భోజన పథకంలో పాలను చేర్చాలని దేశ ఉపాధ్యక్షుడు ఆదేశించారు. ఈ భోజన పథకం ప్రయోజనం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ నిధుల పాఠశాలలు, మునిసిపల్ కార్పొరేషన్లు లేదా మునిసిపల్ పాఠశాలలు, ప్రత్యేక శిక్షణా కేంద్రాలు, మదర్సాలు, మక్తాబ్స్ వంటి స్థానిక సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు ఇవ్వబడుతుంది. ఈ పథకం సర్వ శిక్ష అభియాన్ కింద నడుస్తుంది.

Polavaram Project: ఢిల్లీకి వెళ్లి ఆ నిధులు వచ్చేలా చూడండి.. అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం..

Corona Spread: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మధ్య వ్యత్యాసాలు.. ఐసీఎంఆర్ నివేదికలో ఆసక్తికర అంశాలు..

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..!