హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేరుతో ఒక బాధితుడికి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచేందుకు సంబంధిత వివరాలు, కార్డు నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడిగాడు. అనంతరం బాధితుడికి వాట్సాప్ ద్వారా ఒక APK ఫైల్ పంపించారు. బాధితుడు ఆ ఫైల్‌ను ఇన్స్టాల్ చేసిన వెంటనే, అతని మొబైల్ ఫోన్ మాల్వేర్ ద్వారా హ్యాక్ చేయబడింది. ఫలితంగా, బాధితుడు ఎటువంటి ఓటీపీని అందించకపోయినా, అతని హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ నుండి రూ.2,91,726 మొత్తం మూడు వేర్వేరు లావాదేవీల ద్వారా డెబిట్ అయ్యాయి.
బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ యూనిట్, హైదరాబాద్ NCRP టీమ్ ఈ ఘటనపై చర్యలు తీసుకొని బాధితుడి మొబైల్ ఫోన్ నుండి మాల్వేర్ను తొలగించారు. లావాదేవీలు యామజాన్ ద్వారా జరిగినట్లు గుర్తించారు. బాధితుడు నవంబర్ 2, 2024న ఆన్లైన్లో సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసాడు. సంబంధిత అధికారులకు నోటీసులు పంపించి, నిధులను బ్లాక్ చేయించారు.
NCRP టీమ్ తీసుకున్న తక్షణ చర్యలతో కోర్టు ఆదేశం లేకుండానే రూ.2,91,726 మొత్తంను వ్యాపారి బాధితుడి హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌కు తిరిగి చెల్లించాడు. ఈ సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ NCRP టీమ్‌ను అభినందించారు.
ఇది కూడా చదవండి: Donkey- Camel Milk: గాడిద – ఒంటె పాలలో ఏది ఖరీదైనది.. వీటిలో ఔషధ గుణాలు ఏంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి