
RBI: ఆర్బిఐ ఒకేసారి 63 ఫైనాన్స్ కంపెనీలపై కీలక చర్య తీసుకుంది. నవంబర్ 16న జారీ చేసిన ఒక నోటిఫికేషన్లో ఆర్బిఐ 49 ఎన్బిఎఫ్సిల (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల) లైసెన్సులను రద్దు చేసింది. ఈ ఉత్తర్వులు అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 29 మధ్య జారీ చేసింది. దీనికి అదనంగా, 13 ఎన్బిఎఫ్సిలు, ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ స్వచ్ఛందంగా తమ లైసెన్సులను సరెండర్ చేసుకున్నాయి. ఈ చర్యను ఆర్బిఐ చట్టం, 1934 కింద తీసుకున్నారు. 63 కంపెనీల లైసెన్సులను ఎందుకు రద్దు చేశారన్నదే ముఖ్యమైన ప్రశ్న.
ఆర్బిఐ ప్రకారం, 14 కంపెనీలు వివిధ కారణాల వల్ల స్వచ్ఛందంగా తమ రిజిస్ట్రేషన్లను వదులుకున్నాయి. వీటిలో ఆరు కంపెనీలు ఎన్బిఎఫ్సిలుగా తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఐదు కంపెనీలకు ఇకపై రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మూడు కంపెనీలు రద్దు కావడం లేదా ఇతర కారణాల వల్ల కార్యకలాపాలను నిలిపివేయడం వల్ల, వాటి రిజిస్ట్రేషన్లు రద్దు అయ్యాయి.
రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కంపెనీ NBFCగా పనిచేయడానికి వీలులేదని ఆర్బిఐ స్పష్టంగా పేర్కొంది. అంటే అవి ఇకపై రుణాలు ఇవ్వలేవు లేదా ఆర్థిక సేవల్లో పాల్గొనలేవు.
ఈ కంపెనీల చట్టపరమైన ఉనికి ముగిసినందున వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది ఆర్బీఐ. మణిభవనం హోమ్ ఫైనాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సన్ సోర్స్ లీఫిన్ ప్రైవేట్ లిమిటెడ్, లియనార్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్.
ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఏదైనా NBFC నుండి రుణం తీసుకోబోతున్నట్లయితే, ఆ కంపెనీ RBI వద్ద నమోదైందో లేదో ముందుగా తనిఖీ చేసుకోవాలి. తెలియని ఏ ఫైనాన్స్ కంపెనీతోనూ సంబంధాలు పెట్టుకోవద్దు.
ఇది కూడా చదవండి: Gold Rate: బంగారం ధర ఇంత తగ్గడం ఈ ఏడాదిలోనే మొదటి సారి..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి