LPG Gas: సామాన్యులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

LPG Gas Cylinder: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి, సరఫరా పూర్తిగా సాధారణంగా ఉందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సంక్షోభం ఉన్నప్పటికీ, ఏ రిటైల్ గ్యాస్ ఏజెన్సీ కూడా గ్యాస్ కొరతను నివేదించలేదు..

LPG Gas: సామాన్యులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!
మధ్యప్రాచ్య సంఘర్షణ కారణంగా ముడిచమురు ధరలు పెరగడం ప్రస్తుతం భారతదేశంతో సహా పలు దేశాలపై ఒత్తిడి తెస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర రోజురోజుకూ పెరుగుతోంది. భారతదేశం ప్రధానంగా సౌదీ అరేబియా నుండి ఎల్పీజీ గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. హోర్ముజ్ ద్వారా రవాణాకు అంతరాయం కలగడంతో ఇంధన దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో అనేక దేశాలకు ముడి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడి ధరలు పెరిగాయి. ముడి చమురు ధరల పెరుగుదలతో భారతదేశంతో సహా పలు దేశాలు చమురు, ఎల్‌పిజి ధరలను పెంచాయి. ముడి చమురు ధరల పెంపు తొలి దశలో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. దీని తర్వాత గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరగడం ప్రారంభించాయి.

Updated on: Jun 07, 2026 | 6:52 AM

LPG Gas Cylinder: దేశవ్యాప్తంగా మరోసారి గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగింది. సిలిండర్‌ ధర 29 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల వ్యవధిలో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర పెరగడం ఇది రెండోసారి. ఢిల్లీలో 14.2 కిలోల LPG సిలిండర్‌ ధర రూ.913 నుంచి రూ.942కు చేరింది. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మార్చి 7న గృహ వినియోగ LPG సిలిండర్‌ ధర రూ.60 పెంచారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పాటు, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధర కూడా పెరుగుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా సరఫరా సమస్యలు తలెత్తినప్పటికీ, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరను పెంచలేదు. అయితే మే 1న ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను పెంచింది. వాణిజ్య సిలిండర్ ధరను రూ.993, ఐదు కేజీల సిలిండర్ ధరను రూ.261 పెంచింది. ఆ తర్వాత, జూన్ 1న వాణిజ్య సిలిండర్ ధర రూ.42 పెరిగింది.

సరఫరాలో ఎలాంటి సమస్య లేదు

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి, సరఫరా పూర్తిగా సాధారణంగా ఉందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సంక్షోభం ఉన్నప్పటికీ, ఏ రిటైల్ గ్యాస్ ఏజెన్సీ కూడా గ్యాస్ కొరతను నివేదించలేదు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించడానికి దేశవ్యాప్తంగా నిరంతర చర్యలు కొనసాగుతున్నాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.4 వేలు తగ్గిన బంగారం ధర.. వెండిపై రూ.15 వేలు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us