LIC Policy: రోజుకు కేవలం రూ.172 ఆదాతో చేతికి రూ.28 లక్షలు.. ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ!

LIC Policy: ఇది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం. ఈ పథకం వార్షిక ఆదాయ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. పాలసీదారుడు పాలసీ కాలంలోనే అకాల మరణం చెందితే, నామినీకి ప్రతి సంవత్సరం ప్రాథమిక హామీ మొత్తంలో 10% వార్షిక ఆదాయంగా అందుతుంది..

LIC Policy: రోజుకు కేవలం రూ.172 ఆదాతో చేతికి రూ.28 లక్షలు.. ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ!
Lic Policy

Updated on: Aug 24, 2026 | 12:27 PM

LIC Policy: దేశంలోనే అతిపెద్ద భీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రతి వర్గానికి రకరకాల పాలసీలను అందిస్తుంది. ఈ పాలసీలలో బాగా ప్రాచుర్యం పొందిన ప్లాన్‌లలో ఒకటి LIC జీవన్ లక్ష్య పాలసీ. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా జీవిత బీమాతో పాటు భారీ పొదుపు ప్రయోజనం కూడా లభిస్తుంది.

ఈ పాలసీ కింద ప్రతిరోజూ కేవలం రూ.172 ఆదా చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో రూ.28.5 లక్షల వరకు భారీ నిధిని పొందవచ్చు. ఇది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం. ఈ పథకం వార్షిక ఆదాయ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. పాలసీదారుడు పాలసీ కాలంలోనే అకాల మరణం చెందితే, నామినీకి ప్రతి సంవత్సరం ప్రాథమిక హామీ మొత్తంలో 10% వార్షిక ఆదాయంగా అందుతుంది. మెచ్యూరిటీ చివరిలో నిర్దిష్ట మొత్తం వారసునికి అందజేస్తారు.

ఇది కూడా చదవండి: Goday Gold Price: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.1.70 లక్షలకు చేరువలో తులం బంగారం ధర..!

ఇవి కూడా చదవండి

మీకు ఎంత హామీ మొత్తం, కాలపరిమితి లభిస్తుంది?

  • కనీస హామీ మొత్తం: రూ.2 లక్షలు (గరిష్ట మొత్తంపై పరిమితి లేదు).
  • పాలసీ కాలపరిమితి: 13 నుండి 25 సంవత్సరాలు.
  • ప్రీమియం చెల్లింపు కాలపరిమితి (PPT): పాలసీ కాలపరిమితి కంటే 3 సంవత్సరాలు తక్కువ (ఉదాహరణకు, 25 సంవత్సరాల పాలసీకి ప్రీమియం కేవలం 22 సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి).
  • వయస్సు, ప్రీమియం చెల్లింపు ఎంపికలు: ఈ పాలసీని 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తి తీసుకోవచ్చు. అయితే గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 65 సంవత్సరాలు. నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షిక ప్రీమియం చెల్లింపు ఎంపికలను ఎంచుకోవచ్చు.
  • రూ.28.5 లక్షల పెద్ద నిధిని ఎలా నిర్మించుకోవాలి? : ఉదాహరణకు 29 ఏళ్ల వ్యక్తి రూ.15 లక్షల హామీ మొత్తంతో 25 సంవత్సరాల కాలానికి LIC జీవన్ లక్ష పాలసీని ఎంచుకుంటే బెనిఫిట్స్‌ ఎలా పొందవచ్చు తెలుసుకుందాం.

ప్రీమియం చెల్లింపు కాలం ఎంత?

  • ప్రీమియం చెల్లింపు కాలపరిమితి: 22 సంవత్సరాలు
  • నెలవారీ ప్రీమియం: సుమారుగా రూ.5,169 (అనగా రోజుకు సుమారుగా రూ.172).
  • మెచ్యూరిటీ మొత్తం: 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత పాలసీదారునికి డబుల్ బోనస్‌తో పాటు సుమారుగా రూ.28.50 లక్షల మొత్తం లభిస్తుంది.
  • గమనిక: ప్రీమియంపై మొదటి సంవత్సరం నుండి 4.5%, రెండవ సంవత్సరం నుండి 2.25% చొప్పున GST వర్తిస్తుంది.)

ఇది కూడా చదవండి: Amazon: అమెజాన్‌లో అయోధ్య ప్రసాదం.. రూ.1 లక్ష జరిమానా.. అసలేం జరిగిందంటే..!

ఇది కూడా చదవండి: Building Construction: పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us