LIC Policies: యువత కోసం ప్రత్యేక పాలసీలను రిలీజ్ చేసిన ఎల్ఐసీ.. ఆ పాలసీలు ప్రత్యేకతలివే..!

|

Aug 09, 2024 | 8:10 PM

ఇన్స్యూరెన్స్ పాలసీ అనేది మన జీవితానికి భద్రత కల్పిస్తుంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి అండగా నిలుస్తుంది. ముఖ్యంగా అనుకోని ఆపద వచ్చినప్పుడు మన కుటుంబానికి భరోసా ఇస్తుంది. వారు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించే అవకాశమిస్తుంది. బీమా కంపెనీ పేరువింటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ విడుదల చేసిన పాలసీలకు ప్రజల ఆదరణ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో యువత కోసం ఎల్ఐసీ కొత్తగా ప్రత్యేక టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్లను విడుదల చేసింది.

LIC Policies: యువత కోసం ప్రత్యేక పాలసీలను రిలీజ్ చేసిన ఎల్ఐసీ.. ఆ పాలసీలు ప్రత్యేకతలివే..!
Lic Policy
Follow us on

ఇన్స్యూరెన్స్ పాలసీ అనేది మన జీవితానికి భద్రత కల్పిస్తుంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి అండగా నిలుస్తుంది. ముఖ్యంగా అనుకోని ఆపద వచ్చినప్పుడు మన కుటుంబానికి భరోసా ఇస్తుంది. వారు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించే అవకాశమిస్తుంది. బీమా కంపెనీ పేరువింటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ విడుదల చేసిన పాలసీలకు ప్రజల ఆదరణ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో యువత కోసం ఎల్ఐసీ కొత్తగా ప్రత్యేక టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్లను విడుదల చేసింది. యువ టర్మ్, డీజీ టర్మ్, యువ క్రెడిట్ లైఫ్, డీజీక్రెడిట్ లైఫ్ పేరుతో వీటిని తీసుకువచ్చింది. కొత్తగా వచ్చిన పాలసీలు 2024 ఆగస్టు 5 నుంచి అమలులోకి వచ్చాయి. వీటిని ప్రత్యేకంగా యువకుల కోసం అమలు చేస్తోంది. దురదృష్టవశాత్తూ పాలసీదారుడు మరణిస్తే అతడికి కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు లోన్‌ రీపేమెంట్‌ ప్రొటెక‌్షన్‌ అందిస్తాయి. వీటిలో యువటర్మ్,యువ క్రెడిట్‌ లైఫ్‌ బీమా ప్లాన్ ను ఎల్ఐసీ ఏజెంట్ల ద్వారా తీసుకోవాలి. అలాగే డీజీ టర్మ్, డీజీ క్రెడిట్‌ లైఫ్‌ ప్లాన్ ను ఆన్ లైన్ లో కంపెనీ వెబ్ సైట్ నుంచి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. చిన్న వయసు నుంచీ బీమా తీసుకునేవారికి కోసం వీటిని రూపొందించారు.

యువ టర్మ్, డిజి టర్మ్ ఉపయోగాలు

ఈ పాలసీలు తీసుకోవడానికి 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసున్న వారు అర్హులు. దురదృష్టవశాత్తూ పాలసీదారులు మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. నాన్-పార్, నాన్-లింక్డ్, లైఫ్, వ్యక్తిగత, స్వచ్ఛమైన రిస్క్ ప్లాన్ ఇది. ఈ పాలసీ మెచ్యూరిటీ వయస్సు 33 నుంచి 75 ఏళ్ల వరకూ ఉంటుంది. బీమా మొత్తం కనిష్టంగా రూ. 50 లక్షలు. గరిష్టంగా రూ. 5 కోట్ల వరకూ అందజేస్తారు. అధిక మొత్తాలకు ఆకర్షణీయమైన రాయితీలు, మహిళలకు తక్కువ ప్రీమియం రేట్లు కల్పించారు. రెగ్యులర్‌, సింగిల్‌ ప్రీమియం ఆప్షన్లు ఉన్నాయి. తీసుకున్న కాలానికి మాత్రమే బీమా కల్పిస్తుంది. గడువు తీరిన తర్వాత ఎలాంటి బెనిఫిట్లు ఉండవు.

యువ క్రెడిట్ లైఫ్ / డీజీ క్రెడిట్ లైఫ్ ప్లాన్లు

ఈ పాలసీలు తీసుకునే వారి వయస్సు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు ఉండాలి. 23 నుంచి 75 వరకూ మెచ్యూరిటీ కాలం ఉంటుంది. బీమాగా కనీసం రూ.50 లక్షల నుంచి గరిష్టంగా రూ.5 కోట్లు అందజేస్తారు. అధిక మొత్తం ప్రీమియాలకు ఆకర్షణీయమైన రాయితీలతో పాటు మహిళలకు తక్కువ ప్రీమియం అందిస్తున్నారు. ఇవి నాన్-పార్, నాన్ లింక్డ్, లైఫ్, ఇండివిడ్యువల్, ప్యూర్ రిస్క్ ప్లాన్లు. ఈ పాలసీలలో ఏళ్ల గడుస్తున్న కొద్దీ రిస్క్‌ బెనిఫిట్స్‌ కింద ఇచ్చే మొత్తం తగ్గుతూ ఉంటుంది. సాధారణంగా ఇల్లు, వాహనం కొనుగోలుకు, చదువు కోసం రుణాలు తీసుకుంటూ ఉంటాం. ఈ క్రెడిట్‌ లైఫ్‌ ప్లాన్లు తీసుకున్న పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మృతి చెందితే.. ఆ రుణాలకు అతడి కుటుంబ సభ్యులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి