AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంతింటి కలను నిజం చేసుకోవడానికి.. జాయింట్‌ హోమ్‌లోన్‌ మంచిదా? పర్సనల్‌ లోన్‌ బెస్టా?

యువ దంపతులు ఇంటి రుణం తీసుకునేటప్పుడు జాయింట్ హోమ్ లోన్ లేదా వ్యక్తిగత రుణాల గురించి ఆలోచిస్తుంటారు. ఆర్థిక నిపుణులు జాయింట్ హోమ్ లోన్‌ను సిఫార్సు చేస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్లు, ఎక్కువ చెల్లింపు కాలం, మరియు డబుల్ టాక్స్ ప్రయోజనాలు జాయింట్ లోన్‌కు ప్రధాన ప్రయోజనాలు.

సొంతింటి కలను నిజం చేసుకోవడానికి.. జాయింట్‌ హోమ్‌లోన్‌ మంచిదా? పర్సనల్‌ లోన్‌ బెస్టా?
Joint Home Loan
SN Pasha
|

Updated on: Jul 27, 2025 | 3:10 PM

Share

సొంత ఇల్లు కలిగి ఉండాలనే కల చాలా మందికి ఉంటుంది. ప్రస్తుత కాలంలో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ.. ఎప్పటికైనా మంచి ఇళ్లు కొనాలని, కట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉండేవారు ఎక్కువగా హోమ్‌ లోన్‌ తీసుకొని ఇళ్లు లేదా ఫ్లాట్‌ కొనుకుంటూ ఉంటారు. అయితే మరి యువ జంటలు జాయింట్‌ హోమ్‌ లోన్‌ తీసుకుంటే మంచిదా? లేక ఇద్దరూ పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే మంచిదా అనే విషయంపై ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.. జాయింట్‌ హోమ్‌ లోన్‌, పర్సనల్‌ లోన్‌ రెండూ చాలా భిన్నమైనవి. కొన్ని సార్లు తమకు సెట్‌కాని లోన్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల నష్టపోతారు. వడ్డీ రూపంలో ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది.

ఆర్థిక నిపుణుల ప్రకారం దంపతులిద్దరూ పర్సనల్‌ లోన్‌ తీసుకోవడం కంటే.. జాయింట్‌ హోమ్‌ లోన్‌ తీసుకోవడమే ఉత్తమం అని అంటున్నారు. అందుకు గల కారణాలను కూడా వివరించాడు..

తక్కువ వడ్డీ

జాయింట్‌ హోమ్‌ లోన్‌కు సాధారణంగా పర్సనల్‌ లోన్‌ కంటే తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. భారతదేశంలో నేడు గృహ రుణ రేట్లు సంవత్సరానికి 8–9 శాతంగా ఉన్నాయి. అయితే వ్యక్తిగత రుణాలు 16 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయి.

జాయింట్‌ హోమ్‌ లోన్‌తో మరో ప్లస్ పాయింట్‌ ఏమిటంటే తిరిగి చెల్లించే కాలం. గృహ రుణాలు 20–30 సంవత్సరాల వరకు ఉంటాయి, ఇది నెలవారీ EMIని సరసమైనదిగా ఉంచుతుంది. వ్యక్తిగత రుణాలు సాధారణంగా 1–5 సంవత్సరాలలోపు చెల్లించాల్సి ఉంటుంది, దీని వలన నెలవారీ వాయిదాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

డబుల్ టాక్స్ సేవింగ్స్

ఉమ్మడి గృహ రుణాలు మరో పెద్ద ప్రయోజం ఏంటంటే.. పన్ను ప్రయోజనాలు. భాగస్వాములిద్దరూ సెక్షన్ 80C కింద అసలు చెల్లింపుపై ఒక్కొక్కరికి రూ.1.5 లక్షల వరకు, సెక్షన్ 24(b) కింద వడ్డీపై ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి సంవత్సరం అందమైన పొదుపును జోడించవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా