AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio IPO: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్.. ప్రపంచంలోనే ఇదే తొలిసారి..

జియో ఐపీఓ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక మంది పాల్గొన్న ఐపీఓగా రికార్డు సొంతం చేసుకుంది. మూడో రోజు ముగిసే సమయానికి జియో ఐపీఓకు 1.38 కోట్లకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు ఏ కంపెనీకి ఇంత పెద్ద మొత్తంలో సబ్‌స్కైబర్లు రాలేదు.

Jio IPO: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్.. ప్రపంచంలోనే ఇదే తొలిసారి..
Jio Ipo
Venkatrao Lella
|

Updated on: Oct 23, 2026 | 9:03 PM

Share

గత కొద్ది రోజుల క్రితం మార్కెట్లోకి వచ్చిన జియో ఐపీఓ చరిత్రలో సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ప్రపంచంలోనే ఎక్కువమంది పాల్గొన్న అదిపెద్ద ఐపీఓగా రికార్డు నెలకొల్పింది. మూడో రోజు ముగిసే సమయానికి 1.38 కోట్లకుపైగా దరఖాస్తులు రాగా.. ఏకంగా రూ.7 లక్షల కోట్లకు పైగా డిమాండ్ వచ్చింది. ఐపీఓ మొత్తం 22.2 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. జియో జారీ చేసిన 27 కోట్ల షేర్ల కోసం మొత్తం 655.68 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. యాంకర్ బుక్ సబ్‌స్క్రిప్షన్ 30 రెట్లు దాటగా.. మొత్తం ఐపీఓ బుక్‌కు 22.2 రేట్లు డిమాండ్ వచ్చింది.

QIB విభాగం 70.55 రెట్లు, NII విభాగం 14 రెట్లు, రిటైల్ విభాగం, 2.72 రెట్లు, ఉద్యోగుల విభాగం 2.93 రెట్లు, షేర్‌హోల్డర్ల విభాగం 7.6 రెట్లు సబ్‌సస్కైబ్ చేశారు. జియో ఐపీఓ పరిమాణం రూ.30,213 కోట్లుగా ఉండగా.. భారత క్యాపిటల్ మార్కెట్ హిస్టరీలో ఇదే అతిపెద్ద ఐపీఓగా నిలిచిందని చెప్పవచ్చు. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ విలువ రూ.10.3 లక్షల కోట్లుగా ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో లిస్టింగ్ సమయంలో సుమారు 15 శాతం లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ అంచనా ప్రకారం లిస్టింగ్ రోజు జియో ప్లాట్‌ఫామ్స్ భారత్‌లో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో జియో ఫ్లాట్‌ఫామ్స్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాయని ఐపీఓకు వచ్చిన స్పందన చూస్తే తెలుస్తోంది.

కేటాయింపుల ప్రాతిపదిక అక్టోబర్ 26న జరగనుండగా.. అక్టోబర్ 27న విజయవంతమైన దరఖాస్తుదారుల డీమ్యాట్ ఖాతాలకు షేర్లను జమ చేయనున్నారు. అక్టోబర్ 28న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో జియో ఫ్లాట్‌ఫామ్ లిస్ట్ కానుంది. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ జీఎంపీ ఈ రోజు ఒక్కో షేరుకు రూ. 238గా ఉంది. ఇది రూ. 1,119 ఎగువ ధర శ్రేణిపై 21% ప్రీమియంగా నిలిచింది. సూచిక లిస్టింగ్ ధర రూ. 1,357గా ఉంది.

Follow Us