Jio 5G Services: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. అప్పటికల్లా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో 5జీ సేవలు.

|

Jan 06, 2023 | 5:08 PM

దేశంలో 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రముఖ టెలికం సంస్థ జియో తన 5జీ సేవలను ఇతర కంపెనీలతో పోల్చితే మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో పలు ప్రధాన నగరాల్లో జియో సేవలను తీసుకొచ్చిన జియో తాజాగా మరో...

Jio 5G Services: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. అప్పటికల్లా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో 5జీ సేవలు.
Jio 5g Services
Follow us on

దేశంలో 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రముఖ టెలికం సంస్థ జియో తన 5జీ సేవలను ఇతర కంపెనీలతో పోల్చితే మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో పలు ప్రధాన నగరాల్లో జియో సేవలను తీసుకొచ్చిన జియో తాజాగా మరో నాలుగు నగరాల్లో సేవలను ప్రారంభించింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, జబల్‌పూర్‌, పంజాబ్లోని లూథియానా, పశ్చిమబెంగాల్లోని సిలిగురి నగరాల్లో ఇవాళ జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఇప్పటివరకు దేశంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల సంఖ్య 72కు చేరింది.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ జియో తన 5జీ వసేలను విస్తరించేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. జియో ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులో 5జీ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత వేగంగా 5జీ సేవలను విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న మూడు నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇక ఈ ఏడాది చివరి నాటికి అన్ని జిల్లాలతో పాటు మండల కేంద్రాల్లో 5జీ సేవలను తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్న తెలిపారు.

ఇదిలా ఉంటే జియో తొలిసారి గతేడాది అక్టోబర్‌ 4వ తేదీన దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్‌కతా నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురాగా అక్టోబర్‌ 22న నట్వారా, చెన్నై నగరాల్లో.. ఆ తర్వాత నవంబర్‌ 10న హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో 5జీ సేవలు మొదలయ్యాయి. తాజాగా డిసెంబర్ 26న ఆంధ్రప్రదేశ్‌లో జియో 5జీ సేవలను ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..