మీరు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే చాలా నష్టపోతారు..!

|

Apr 14, 2021 | 8:43 PM

SEBI Cautions : స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ విషయం తెలుసుకోండి. మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా

మీరు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే చాలా నష్టపోతారు..!
Sebi Cautions
Follow us on

SEBI Cautions : స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ విషయం తెలుసుకోండి. మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రజలను జరుగుతున్న మోసాల గురించి హెచ్చరించింది. మోసగాళ్ళు తమనుసెబీ అధికారులుగా చెప్పుకుంటూ తిరుగుతున్నారని తెలిపింది. ప్రజల ఇబ్బందులను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించింది. సెబీ పేరిట పెట్టుబడిదారులను, ప్రజలను మోసం చేస్తున్న ఫ్రాడ్‌ గాళ్లను సెబీ ఇటీవల గమనించిదన్నారు. వీరి భారిన పడకుండా పెట్టుబడిదారులు, సామాన్య ప్రజలను రెగ్యులేటర్ హెచ్చరించింది.

ఈ మోసగాళ్ళు పెట్టుబడిదారుల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతామని దగ్గరవుతారని తెలిపింది. సెబీ అధికారిక వెబ్‌సైట్ వలె కనిపించే నకిలీ వెబ్‌సైట్ ద్వారా తప్పుడు ఇ-మెయిల్‌లను పంపడం ద్వారా మోసాలకు తెగబడుతారని హెచ్చరించింది. రెగ్యులేటర్ ప్రకారం.. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఫీజులపేరిట పెట్టుబడిదారులను డబ్బు అడుగుతారు. ఇలాంటి మోసగాళ్ళపై అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సూచిస్తోంది. సెబీ ఉద్యోగుల పేరిట వచ్చే ఇ-మెయిల్స్ గురించి జాగ్రత్తగా ఉండండి అలాంటి ఇ-మెయిల్స్‌కు రిప్లై ఇవ్వకండని తెలిపింది.

రెగ్యులేటర్ ప్రకారం.. సెబీ అధికారిక వెబ్‌సైట్ https: cores.gov.in. ఇందులో పెట్టుబడిదారులు తమ ఫిర్యాదులను పేర్కొనవచ్చని సూచించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల నుంచి వచ్చే ఇ మెయిల్‌ల ద్వారా తప్పుదారి పట్టవద్దని తెలిపింది. స్టాక్ మార్కెట్ మోసం లేదా స్పూఫింగ్‌లో కొనుగోలు లేదా అమ్మకపు ఆర్డర్‌లను అరికట్టడానికి సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి అలాంటి చర్యలను మళ్లీ మళ్లీ చేస్తే అతని వ్యాపారాన్ని 15 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఆపవచ్చని తెలిపింది. స్పూఫింగ్‌లో స్టాక్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో కొనుగోలు లేదా అమ్మకపు ఆర్డర్‌లను ఉంచుతారు. కానీ ఈ ఆదేశాలను అమలు చేయడానికి ముందు వారు దానిని రద్దు చేస్తారు.

శ్రీ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గుంరించి..ఆ గండం ఉన్న నేత ఎవరంటే..?

SRH vs RCB Live Score IPL 2021: ఫేస్ టు ఫేస్.. సూపర్ ఫైట్.. హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. గెలిచేది మాత్రం..?

Corona Pandemic: డాక్టర్ మానవత్వం..కరోనా పేషేంట్ కు పుట్టిన బిడ్డకు తన శ్వాసతో ప్రాణం పోసిన వైనం!