AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా..?

భారతీయులకు బంగారం అంటే ఎనలేని సెంటిమెంట్. ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు, తరతరాలుగా నమ్ముకున్న తిరుగులేని ఆర్థిక రక్షణ కవచం. మార్కెట్లు కుప్పకూలినా, ద్రవ్యోల్బణం పెరిగినా పసిడిపై భరోసా ఏమాత్రం తగ్గదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒక లక్ష రూపాయలను బంగారంలో పెట్టుబడిగా పెడితే.. రాబోయే పదేళ్లలో అది ఎంతటి సంపదగా మారుతుందనే అంశంపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.

బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా..?
Investing Rs 1 Lakh In Gold
Krishna S
|

Updated on: Sep 15, 2026 | 2:50 PM

Share

భారతీయులకు బంగారంతో విడదీయరాని అనుబంధం ఉంది. దీనిని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా సంక్షోభ సమయాల్లో ఆదుకునే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక లక్ష మొత్తాన్ని బంగారంలో ఒకేసారి పెట్టుబడి పెట్టి పదేళ్లపాటు కొనసాగిస్తే, ఆ మొత్తం భవిష్యత్తులో ఎంతగా వృద్ధి చెందుతుందనే అంశంపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. దీర్ఘకాలంలో భారత మార్కెట్లో బంగారం మంచి పనితీరునే కనబరుస్తుంది. గత చరిత్రను పరిశీలిస్తే.. బంగారం సగటు వార్షిక వృద్ధి రేటు సుమారు 13.8 శాతం నుండి 15 శాతం వరకు నమోదైంది. అయితే బంగారం ధరలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ హెచ్చుతగ్గులు మరియు కేంద్ర బ్యాంకుల నిర్ణయాలపై వీటి రాబడులు ఆధారపడి ఉంటాయి.

గత గణాంకాల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తే రాబడులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బంగారం రాబోయే పదేళ్లలో సగటున 8 శాతం వార్షిక రాబడిని ఇస్తే రూ.లక్ష మొత్తం రూ.2.16 లక్షలు అవుతుంది. అదే 10 శాతం వృద్ధి వద్ద రూ.2.59 లక్షలు, 12 శాతం వద్ద రూ.3.11 లక్షలు, 13.8 శాతం వద్ద రూ.3.64 లక్షలకు చేరుకుంటుంది. చారిత్రక సగటు ప్రకారం 14.3 శాతం వార్షిక రాబడి లభిస్తే ఈ పెట్టుబడి విలువ దాదాపు రూ.3.81 లక్షలకు ఎగబాకుతుంది. ఇంకా అధికంగా 15 శాతం వృద్ధి రేటు నమోదైతే అది ఏకంగా రూ.4.05 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. వార్షిక సగటు రాబడి అంటే ప్రతి ఏటా ఖచ్చితంగా అంతే శాతం పెరుగుతుందని అర్థం కాదు. కొన్ని సంవత్సరాల్లో బంగారం ధరలు విపరీతంగా పెరగవచ్చు, మరికొన్ని సంవత్సరాల్లో తగ్గుముఖం పట్టవచ్చు లేదా స్తబ్దుగా ఉండవచ్చు. కాబట్టి గతం ఆధారంగా భవిష్యత్ రాబడులపై ఎటువంటి ముందస్తు గ్యారెంటీ ఉండదు.

నేడు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి భౌతిక రూపంలో ఉండే నాణేలు, నగల కంటే గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ వంటి సౌకర్యవంతమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటి నిర్వహణ ఖర్చులు, పన్ను నిబంధనలను అర్థం చేసుకుని ముందుకు సాగడం ఉత్తమం. అలాగే, చేతిలో ఉన్న మొత్తం డబ్బును ఒకే ఆస్తిలో పెట్టేయకుండా, రిస్క్ తగ్గించుకోవడానికి స్టాక్ మార్కెట్, ఇతర ఆర్థిక సాధనాలతో కలిపి బంగారంలో మదుపు చేయడమే సరైన వ్యూహమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం